»   » తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం: సహాయ నటి అనుమానాస్పద మృతి

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం: సహాయ నటి అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినీ నటి సపర్ణ అనుమానాస్పద మృతి సంఘటన వ్యవహారం ఇంకా కొలిక్కిరాక ముందే తమిళ పరిశ్రమలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సహాయ నటి జయశీలి ఆదివారం రాత్రి అనుమాన్పాద స్థితిలో మృత్యువు ఒడిలోకి చేరింది.

స్థానిక సాలిగ్రామంలోని దశరథపురంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆమె శవమై కనిపించింది. ఇరుగుపొరుగువారు సమాచారంతో విరుగంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకుని జయశీలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో దోపిడీదొంగలు నగలు, నగదు కోసం ఈ హత్య చేసుంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. జయశీలి వయస్సు 49 ఏళ్లు. ఆమె పలు టీవీ సీరియల్లలోనూ యాడ్స్‌లోనూ నటిచంింది.

Actress Jayaseeli found dead in Chennai

దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు గేట్ బయటి నుంచి తాళం వేసి ఉండడం కనిపించింది. ప్రధాన ద్వారం సగం తెరిచి ఉంది. ఆమె శవం నగ్నంగా పడకపై పడి ఉంది.

సేలంలో ఉంటున్న ఆమె సోదరుడు సెల్వరాజ్ చెన్నైకి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె ఫోన్ ఎత్తడం లేదని అతను చెప్పాపడు. గత నెలలోనే సెల్వరాజ్ తమ స్వస్థలం సేలం వెళ్లాడు. దీంతో జయశీలి ఒక్కతే ఇంట్లో ఉంటోంది.

ఆమె వద్ద ఉన్న 50 సవరల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని అతను పోలీసులకు చెప్పాడు. తెలిసినవారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A 49-year-old small-time actor was found dead in her house at Saligramam in Chennai on Sunday. The deceased has been identified as D Jayaseeli, 49, of Periyar Street.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu