twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసెంబ్లీ ఎన్నికల బరిలో జీవితా రాజశేఖర్.. బీజేపీ గెలుపు గుర్రంగా.. హైదరాబాద్‌లో ఎక్కడ నుంచి పోటీ అంటే?

    |

    తెలంగాణ ప్రాంతంలో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రకరకాల వ్యూహాలను తెలంగాణలో అమలు చేస్తున్నది. అందులో భాగంగా సినీ తారలకు గాలం వేస్తూ పార్టీని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు సినీతారలను పార్టీలో చేర్చుకొనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే జీవితను వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు రంగం సిద్దం చేస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

    గెలుపు గుర్రాలపై బీజేపీ ఫోకస్

    గెలుపు గుర్రాలపై బీజేపీ ఫోకస్

    తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు బీజీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. బలమైన టీఆర్ఎస్‌ను ఎదురించి విజయం సాధించే గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. దాంతో తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలను ప్రభావితం చేసే అభ్యర్థుల ఫోకస్ పెట్టింది.

    జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌తో భేటీలు

    జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌తో భేటీలు


    తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా సానుకూలత పెంచుకోవడానికి, వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ కొత్త ఎత్తుగడలను వేస్తూ కనిపిస్తున్నది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కావడం, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యువ హీరో నితిన్‌తో సమావేశం ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి.

     జీవితా రాజశేఖర్ మరింత యాక్టివ్‌గా

    జీవితా రాజశేఖర్ మరింత యాక్టివ్‌గా

    తెలంగాణలో ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవిత రాజశేఖర్‌ను పార్టీలో క్రియాశీలకంగా మార్చింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన పాదయాత్రలో జీవితా రాజశేఖర్ చురకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగమై పార్టీ కార్యకలాపాల్లో మరింత ఆకర్షణీయంగా మారారు. బండి సంజయ్ పాదయాత్రలో జీవిత రాజశేఖర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.

    కేసీఆర్, కవితపై విరుచుకుపడ్డ జీవిత

    కేసీఆర్, కవితపై విరుచుకుపడ్డ జీవిత

    బండి సంజయ్ పాద యాత్రలో జీవిత మాట్లాడుతూ. టీఆర్ఎస్ తప్పిదాలు, కవిత లిక్కర్ స్కామ్ అంశాలపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చిత్రగుప్తుడి చిట్టాలో మాదిరిగా తప్పులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ప్రమేయం ఉందని వార్త వచ్చింది. ఇక గుమ్మడి కాయల దొంగ అంటే.. భుజాలు తడుముకున్నట్టుగా కవిత వ్యవహరించింది అని జీవిత విమర్శించారు.

    హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి

    హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి

    ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా, ధైర్యంగా విమర్శలు చేస్తున్న జీవిత సేవలను పార్టీకి వాడుకోవాలని నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో జీవితను అసెంబ్లీ బరిలో దించేందుకు ప్లాన్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గం నుంచి జీవిత పోటీ చేయనున్నారు అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే జీవిత ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని పార్టీ వర్గాలు సీక్రెట్‌గా పెడుతున్నారు. త్వరలోనే జీవిత పోటీ చేసే స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Actress Jeevitha Rajasekhar is becomes active in the Telangana Politics. Reports suggest that Jeevitha is going to contest from Hyderabad region.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X