»   » ప్రేమిస్తే హీరోయిన్, పవన్ కళ్యాణ్ సిస్టర్ మ్యారేజ్ (ఫోటోస్)

ప్రేమిస్తే హీరోయిన్, పవన్ కళ్యాణ్ సిస్టర్ మ్యారేజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ చిత్రం కాదల్ (తెలుగులో ‘ప్రేమిస్తే') సినిమాతో సౌత్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంధ్య. ఆ తర్వాత హీరోయిన్ గా ఆమె చాలా సినిమాలు చేసినా ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘అన్నవరం'. ఇందులో పవన్ కళ్యాణ్ చెల్లిగా సంధ్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

27 సంవత్సరాల వయసున్న ఈ బ్యూటీ వివాహం డిసెంబర్ 6న కేరళలోని ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో జరిగింది. ఐటి ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్ ను ఆమె వివాహమాడారు. వాస్తవానికి వీరి వివాహం చెన్నైలోనే ప్లాన్ చేసుకున్నారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా వివాహ వేదిక అప్పటికప్పుడు కేరళకు మార్చారు.

భారీ వరదల కారణంగా సంధ్య ఫ్యామిలీ చెన్నైలోనే చిక్కుకున్నారు. ప్రకృతి వైపరీత్యంతో టెలిఫోన్ నెట్వర్క్ కూడా పని చేయలేదు. పెళ్లి సమయం దగ్గర పడుతున్నా వీరు కాంటాక్టులోకి రాక పోవడంతో వరుడితరుపు వారు కాస్త కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు శనివారం ఉదయం ఫోన్ కలవడంతో వెంటనే కేరళలోని గురువాయూర్ దేవాలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు అందరూ కేరళలోని గురువాయూర్ టెంపుల్ చేరుకుని కొద్ది మంది బంధువుల మధ్య వివాహం కార్యక్రమం కానిచ్చేసారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

ప్రేమిస్తే..

ప్రేమిస్తే..


తమిళంలో వచ్చిన ‘కాదల్' సినిమా ద్వారా సంధ్య హీరోయిన్ గా పరిచయం అయింది. అదే సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే'గా విడుదలైంది.

తెలుగులో..

తెలుగులో..


తెలుగులో ఆమె నేరుగా నటించిన తొలి చిత్రం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అన్నవరం'. ఈ చిత్రంలో ఆమె పవన్ కళ్యాణ్ చెల్లి పాత్రలో నటించింది. తర్వాత హాసిని అనే చిత్రంలో నటించినా అది హిట్ కాలేదు.

తమిళం, మళయాలం

తమిళం, మళయాలం


తమిళం, మళయాలం చిత్రాల్లోనే సంధ్య ఎక్కువగా నటించారు.

మలయాళంలో బిజీ..

మలయాళంలో బిజీ..


ప్రస్తుతం సంధ్య నాలుగు మళయాలం చిత్రాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Actress Sandhya, popularly known as 'Kaadhal' Sandhya because of her debut movie, entered into wedlock on Sunday (December 6th). The marriage took place in Kerala at the famous Guruvayur temple, according to a report. Her wedding, with an IT professional named Venkat Chandrasekharan, was initially planned to take place in Chennai but later shifted to Kerala because of the unfortunate flood, the city is battling at the moment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu