»   » సరికొత్త రికార్డు సృష్టించిన నటి కరాటె కళ్యాణి!

సరికొత్త రికార్డు సృష్టించిన నటి కరాటె కళ్యాణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నటి, హరికథ కళాకారిణి, ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకులు పడాల కళ్యాణికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆదిభట్ల కళాపీఠం ద్వారా సుదీ ర్ఘ హరికథా ప్రవచనాలను నిర్వహించినందుకు ఈమె ఈ రికార్డు సాధించారు. గత ఏడాది జూన్‌ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించారు.

దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించారు. హరికథా రం గంలోనే మొట్ట మొదటిసారిగా నిరంతర హరికథ యజ్ఞానికి శ్రీకారం చుట్టి కళ్యాణి విజయవంతమ య్యారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ విజయ ఘోష్‌ నుంచి లేఖ వచ్చినట్టు కళ్యాణి తెలిపారు.

Actress Karate Kalyani in Limca Book of Records

కళ్యాణి....తెలుగు సినిమాల్లో కమెడీ పాత్రల్లో, హాట్ ఆంటీగా పలు సినిమాల్లో నటించిన కళ్యాణి మిరపకాయ్ చిత్రంలో ‘అబ్భ...' అనే మ్యానిరిజంతో పాపులర్ అయింది.

గతేడాది పేకాటతో హాట్ టాపిక్...
గతేడాది ఏప్రిల్ నెలల కళ్యాణిపై పేకాట ఆరోపణలు వచ్చాయి. తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారని కళ్యాణి ఆరోపించారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. ఈ సంఘటన తర్వాత ఆమె హరికథ కళాపీఠంపై సీరియస్ గా దృష్టి సారించి కళాపీఠం స్థాపనలో విజయవంతం అయ్యారు.

English summary
Actress Karate Kalyani in Limca Book of Records. Last year between June 20th to 25th, she gave non-stop Hari Katha performance in Hyderabad for 114 hours 45 mins 55 seconds. After examining the act, Limca Book has included Kalyani's name in the latest edition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu