For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతారకు ట్విన్స్.. సరోగసి నేరమన్న సీనియర్ హీరోయిన్, చిరు అంటే ఇష్టం లేదట

  |

  ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ కవల పిల్లల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా రన్ అవుతోంది. అక్టోబర్ 9 అంటే ఆదివారం తమకు మగ కవల పిల్లలు పుట్టినట్లు నయనతార, విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారిద్దరికి ఉయిర్ అండ్ ఉలగమ్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే ఎలా కవలపిల్లలకు జన్మనిచ్చింది అని అనేకమందికి వస్తున్న సందేహం. నయనతార సరోగసి విధానం ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చి ఉండొచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అలనాటి బ్యూటిఫుల్ హీరోయిన్, ప్రస్తుతం బుల్లితెరపై, వెబ్ సిరీస్ లలో నటిస్తున్న నటి షాకింగ్ గా ట్వీట్ చేసింది. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

   మా పూర్వీకుల ఆశీర్వాదాలతో..

  మా పూర్వీకుల ఆశీర్వాదాలతో..

  నయన్ విఘ్నేష్ దంపతులకు పండంటి ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న నయనతార తన కవల పిల్లలను చిట్టి కాళ్లను ముద్దాడుతూ ట్విటర్ వేదికగా ఫొటో షేర్ చేసింది నయనతార. ఈ ట్వీట్ లో ''అమ్మ నాన్నలం అయ్యాం. #Wikkinayan మగ కవల పిల్లలు జన్మించారు. ఉయిర్ అండ్ ఉలగమ్ పుట్టారు'' అని రాసుకొచ్చింది నయనతార. అయితే ఉయిర్ అంటే జీవితం అని ఉలగమ్ అంటే ప్రపంచం అని అర్థాలు వస్తున్నాయి. అలాగే ''మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో ఇద్దరు పిల్లలు మా జీవితంలోకి వచ్చారు. మాకోసం మీ అందరి ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా'' అని విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు.

  సరోగసి విధానం ద్వారా..

  సరోగసి విధానం ద్వారా..

  ఇదిలా ఉంటే నయన్ విఘ్నేష్ దంపతులు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అయినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సరోగసీకి సంబంధించి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరో హాట్ టాపిక్ అయింది. ''భారతదేశంలో సరోగసీని బ్యాన్ చేశారు. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ఈ పద్ధతిని ప్రోత్సహించకూడదు. రాబోయే రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం'' అని ట్వీట్ చేసింది కస్తూరి. ఇక ఈ ట్వీట్ చూసిన నయనతార ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. 'మీ పని మీరు చూసుకోండి' అని కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లపై కస్తూరి స్పందిస్తూ ''అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకుంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేయలేదు'' అని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్.

  ఫొటోలు షేర్ చేయండి..

  ఫొటోలు షేర్ చేయండి..


  ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మెగాస్టార్ చిరంజీవి అంటే మీకు ఇష్టం లేదట కదా..' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ చిన్న రోల్ చేసిన కస్తూరి.. ఇటీవల ఈ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొంది. ఈ విషయంపై మాట్లాడుతూ ఓ నెటిజన్ ''గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ ఫొటోలు షేర్ చేయండి. మీకు చిరంజీవి అంటేనే అస్సలు నచ్చదట కదా. ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు చెప్పారు. అలాంటప్పుడు ఆయన సినిమాలో ఎందుకు నటించారు'' అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ ''ఏం మాట్లాడుతున్నారు.. ఈ పిచ్చి మాటలు ఎందుకు.. చిరంజీవి అంటే ఇష్టపడని వారుండరు. అలాంటిది నా విషయంలో మీ తల్లిదండ్రులు అలా చెప్పడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు'' అని అసహనం వ్యక్తం చేసింది.

  తమిళనాడు ఆరోగ్య మంత్రి క్లారిటీ..

  కాగా అన్నమయ్య, రథయాత్ర వంటి తదితర చిత్రాలతో అలరించిన కస్తూరి శంకర్ ఇటీవల పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే పరంపర వంటి వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ పాపులర్ అవుతోంది. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో అలరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. చట్టాన్ని అతిక్రమించినందుకు నయనతార, విఘ్నేష్ శివన్ లకు కోర్టు నోటీసులు పంపిందని సమాచారం. పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలని నయన్, విఘ్నేష్ లను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరిందని తెలుస్తోంది. ఈ విషయంపై తమిళనాడు ఆరోగ్య మంత్రి క్లారిటీ ఇచ్చారు. సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయని.. వాటిని నయనతార, విఘ్నేష్ శివన్ అనుసరించారో.. లేదో.. అనేది మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

  English summary
  South Lady Superstar Nayanthara Vignesh Shivan Blessed With Twin Baby Boys And Actress Kasthuri Shankar Tweet On Surrogacy Method.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X