»   » రాత్రికి వస్తావా? డబ్బులిస్తాను: హీరోయిన్‌కి చేదు అనుభవం

రాత్రికి వస్తావా? డబ్బులిస్తాను: హీరోయిన్‌కి చేదు అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫోన్‌ చేసి తనను లైంగికంగా వేధిస్తున్న ఓ గుర్తు తెలియని ఆకతాయి పై బాలీవుడ్‌ నటి కోయినా మిత్రా ఇటీవల కేసు నమోదు చేసింది. తనకు ఫోన్‌ చేసి ఒక రాత్రికి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై ముంబైలోని ఒషివరా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం చేసిన ఆమె ఫిర్యాదు ప్రకారం..

గత వారం రోజుల్లో 40-50 గుర్తుతెలియని ఫోన్‌ నంబర్ల నుంచి ఆమెకు కాల్స్‌ వచ్చాయి. ఈ కాల్స్‌ను ఆమె మొదట పట్టించుకోలేదు. కానీ గడిచిన వారం రోజుల్లో 50 ఫోన్ నెంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, తొలుత కాల్స్‌ను పట్టించుకోలేదని కానీ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పింది.

Actress Koena Mitra sexually harassed by pervert

'రాత్రికి వస్తావా? డబ్బులిస్తాను', అని నీచంగా మాట్లాడుతున్నారని తెలిపింది. అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని పేర్కొంది. కోయినా మిత్రా ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశామని, కాల్స్ వచ్చిన నంబర్ల ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.. ఆమె ఫిర్యాదుని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొని ఆ ఆకతాయికి బుద్ధి చెప్పే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, రోడ్, హే బేబీ, ముసాఫిర్, ఏక్ హసీనా ఏక్ ఖిలాడీ తదితర చిత్రాలతో పాటు, పలు బాలీవుడ్ సినిమాల్లో కోయినా మిత్రా ఐటంసాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.

English summary
After an unknown person called up actor Koena Mitra on Saturday and asked her for a night out, she registered a sexual harassment complaint against the caller at Oshiwara police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X