»   » బేగంపేట: లక్ష్మీరాయ్ భయపెడుతోంది! (ఫోటోస్)

బేగంపేట: లక్ష్మీరాయ్ భయపెడుతోంది! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: తమిళంలో మైనా, సొట్టె వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సోలమ్ స్టూడియోస్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ‘బేగంపేట'. తమిళ హీరో శ్రీరామ్, లక్ష్మీ రాయ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్ విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వడివుడయాన్ దర్శకుడు.

Actress Lakshmi Rai's 'Begumpet' Movie

చిత్ర దర్శకుడు వడిపుడయాన్ మాట్లాడుతూ.. ఇటీవల ఈ చిత్రం కోసం హైదరాబాద్ పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ సారథ్యంలో హీరో హీరోయిన్లు శ్రీరామ్, లక్ష్మీరాయ్ లు 50 ప్రేతాత్మలతో తలపడే దృశ్యాలను వరుసగా పది రోజులు రాత్రిపూట చిత్రీకరించారు. దీంతో పాటు మరో పది రోజులు హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో మరి కొన్ని దృశ్యాలు తీశారు. హైదరాబాద్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది అన్నారు.

Actress Lakshmi Rai's 'Begumpet' Movie

కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. జాన్ పీటర్ అందిస్తున్న మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్సవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని థ్రిల్ కలిగిస్తుంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

English summary
Sriram (Srikanth), Actress Lakshmi Rai, Suman starring Begumpet Telugu Movie Stills. Directed by VC Vadivudaiyan and Music by John Peter.
Please Wait while comments are loading...