»   » నయనతారా మజాకా.. 50 సెకన్లు.. 5 కోట్లు.. బాలయ్యకూ ఆ కష్టాలు తప్పవా?

నయనతారా మజాకా.. 50 సెకన్లు.. 5 కోట్లు.. బాలయ్యకూ ఆ కష్టాలు తప్పవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా దక్షిణాదిలో దూసుకుపోతున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. అగ్ర హీరోల సరసన నటిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో దుమ్ము రేపుతున్నది. ఆమె నటించిన డోరా, వాసుకి చిత్రాలు దక్షిణాదిలో మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. అదీ ఓ సినిమాకు కాకుండా వ్యాపార ప్రకటనకు కోసం భారీ మొత్తాన్ని తీసుకోవడం ఓ విశేషంగా మారింది.

గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలకు తిప్పలు

గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలకు తిప్పలు

వయసు మీద పడుతున్నా దక్షిణాదిలో నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాను ఒప్పుకొనే ముందు చాలా షరతులను నిర్మాతల ముందు పెడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా రకరకాల గొంతెమ్మ కోర్కెలు కూడా కోరుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు..

ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు..

అయితే తాజా రిపోర్టు ప్రకారం ఓ సినిమాకు రూ.4 కోట్లు తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్లకు రావాలని కోరవద్దు అనే షరతును నయనతార నిర్మాతల ముందు పెట్టిందనేది తాజా సమాచారం.

50 సెకన్ల కోసం 5 కోట్లు

50 సెకన్ల కోసం 5 కోట్లు

ఇదిలా ఉండగా, ఇటీవల నయనతార డీటీహెచ్ సర్వీస్ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ వ్యాపార ప్రకటన నిడివి సుమారు 50 సెకన్లు మాత్రమే. ఈ వ్యాపార ప్రకటన కోసం కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్‌కు వెళ్లిందట. అయితే ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం రూ.5 కోట్లు. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఫిలింవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

టాలీవుడ్ నిర్మాతకు చుక్కలు

టాలీవుడ్ నిర్మాతకు చుక్కలు

ఇటీవల తెలుగులో నటించిన ఓ చిత్ర ప్రమోషన్‌కు రావాలని సదరు నిర్మాత నయనతారను కోరారట. అయితే రూ.30 లక్షలు ఇస్తే తాను ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పే సరికి నిర్మాతకు దిమ్మతిరిగిందట. చేసేదేమీ లేక హీరోతోనే సరిపెట్టుకోవాలనుకొన్నాడు. కానీ ఓ వివాదం కారణంగా ఆ సినిమా రిలీజ్‌ కాకుండానే ఆగిపోయింది.

బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో..

బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో..

ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో నయనతార నటిస్తున్నది. ఈ చిత్రానికి తమిల దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే బాలకృష్ణ సినిమాకు కూడా ఇలాంటి షరతులు పెట్టిందా? అందుకు చిత్ర నిర్మాత ఒప్పుకున్నాడా అనేది ఫిలింనగర్‌లో చర్చ జరుగుతున్నది.

English summary
No doubt, Nayanatara is the top actress in south film industry. Now she is acting lady oriented movies and potraying lead heroine beside Top heroes. Reports suggest that she is charging Rs.4 Cr per a movie. Latest news in viral that She charged Rs.5 crores for 50 second advertisement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu