twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Skylab గ్యారెంటీగా గొప్ప సినిమా..దర్శకుడికే క్రెడిట్ అంతా..నటిగా, నిర్మాతగా గర్వంగా ఉంది..నిత్యమీనన్ ఎమోషనల్

    |

    ప్రఖ్యాత విశ్వ పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన తొలి అమెరికా స్పేస్ స్టేషన్ స్కైలాబ్. 1973 నుంచి 1974 మధ్య దాదాపు 24 వారాలపాటు విశ్వంలో పనిచేసింది. అయితే స్కైలాబ్ ప్రయోగం విఫలం కావడంతో 1979 జూలై 11వ తేదీన హిందూ మహాసముద్రం, పశ్చిమ ఆస్ట్రేలియాలో కుప్పకూలింది. అయితే స్కైలాబ్ భూమివైపు దూసుకొస్తుందనే వార్తలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కథతో దర్శకుడు విశ్వక్ చేసిన ప్రయోగం స్కైలాబ్. ఈ సినిమా కథ విని ప్రముఖ హీరోయిన్ నిత్య మీనన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారారు. ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ సందర్భంగా నిత్యమీనన్ భావోద్వేగంతో మాట్లాడుతూ..

    స్కైలాబ్ కథ విన్నప్పుడు

    స్కైలాబ్ కథ విన్నప్పుడు

    స్కైలాబ్ కథ చెప్పినప్పుడు నేను షాక్ గురయ్యాను. ఇలాంటి కథ ఉన్నప్పుడు దీనిపై ఎవరు సినిమా ఎందుకు చేయలేదనే సందేహాలు వచ్చాయి. వెంటనే స్కైలాబ్ గురించి నేను నా తల్లిదండ్రులను అడిగాను. దాంతో వాళ్లు చాలా కథలు చెప్పారు. ఈ సినిమా తీయాలని, ఈ కథను ఈ జనరేషన్‌కు చెప్పాలని అప్పుడే అనిపించింది అని నిత్య మీనన్ అన్నారు.

    కరీంనగర్ జిల్లా బండలింగంపల్లిలో

    కరీంనగర్ జిల్లా బండలింగంపల్లిలో

    కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లిలో జరిగే కథ కోసం చేసిన స్టైలింగ్, మ్యూజిక్, ఇతర టెక్నికల్ విషయాలను విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కథకు తగినట్టే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ ఉంటుందని చెప్పినప్పుడు తెలుగు సినిమాలో ఇది తొలిసారి చేసే ప్రయోగమని అనిపించింది. నేను చేయాలనుకొన్న డ్రీమ్ అని నిత్య మీనన్ అన్నారు.

    దర్శకుడు విశ్వక్, నిర్మాత పృథ్వీకి థ్యాంక్స్

    దర్శకుడు విశ్వక్, నిర్మాత పృథ్వీకి థ్యాంక్స్

    నా కెరీర్‌లో ఒక గొప్ప సినిమా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు దర్శకుడు విశ్వక్ థ్యాంక్యూ చెబుతున్నారు. కానీ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నేను విశ్వక్‌కు, పృథ్వీకి థ్యాంక్స్ చెప్పాలని అనుకొంటున్నాను. ఈ సినిమాకు అండగా, ప్రొటెక్ట్‌గా నిలువాలని కథ విన్నప్పుడే అనుకొన్నాను. దాంతో అనుకోకుండా నేను నిర్మాతగా ఈ సినిమాకు మారాల్సి వచ్చింది. స్కైలాబ్ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నా యాక్టింగ్ కెరీర్‌లో ఒక మంచి సినిమా చేస్తున్నానే భావనలో ఉన్నాను అని నిత్య మీనన్ చెప్పారు.

    డబ్బు వస్తుందా? పోతుందా అనే భయం లేకుండా..

    డబ్బు వస్తుందా? పోతుందా అనే భయం లేకుండా..


    స్కైలాబ్ సినిమా విషయంలో ప్రతీ ఒక్క అంశానికి దర్శకుడు విశ్వక్‌కు క్రెడిట్ చెందుతుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తే నేను విశ్వక్‌తో ప్రతీ సినిమాను రూపొందిస్తాను. నా కెరీర్‌లో చూసిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్‌లో ఒకరు. ఇక నిర్మాత పృథ్వీ గురించి చెప్పాల్సి వస్తే.. డబ్బు వస్తుందా? పోతుందా అనేది పట్టించుకోలేదు. ఈ సినిమాకు నేను ఏం చేయాలి? అని ఆలోచించాడు. నా ప్రపంచంలో విశ్వక్, పృథ్వీ స్పెషల్ వ్యక్తులుగా మారారు అని నిత్య మీనన్ చెప్పారు.

    సత్యదేవ్, రాహుల్ నటన భేష్..

    సత్యదేవ్, రాహుల్ నటన భేష్..

    అలాగే స్కైలాబ్‌లో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ నటన అద్భుతంగా ఉంది. చిన్న చిన్న హావభావాలు కూడా హృదయాన్ని టచ్ చేస్తాయి. ఈ సినిమాకు వారి ఫెర్ఫార్మెన్స్ బలంగా మారింది. ఇక ఆదిత్య సినిమాటోగ్రాఫర్, ఇతర సాంకేతిక నిపుణులు పనితీరు అద్బుతంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు అని నిత్య మీనన్ అన్నారు.

    Recommended Video

    IFFI 2019 : Rashmika Mandanna About How She Deal With Trolls

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ల భరణి తదితరులు
    దర్శకుడు: విశ్వక్ ఖండేరావు
    నిర్మాత: పృథ్వీ పిన్నంరాజు
    సహ నిర్మాత: నిత్య మీనన్
    సమర్పణ: డాక్టర్ కే రవికిరణ్
    సినిమాటోగ్రఫి: ఆదిత్య
    ఎడిటింగ్: రవి తేజ గిరిజాల
    మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
    బ్యానర్స్: నిత్య మీనన్ కంపెనీ, బైట్ ఫీచర్స్
    రిలీజ్ డేట్: 2021-12-04

    English summary
    Actress Nithya Menen doing a project called Skylab as producer. She speaks Emotionally at Skylab Trailer Launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X