»   » ఆరు బయటే దుస్తులు మార్చుకునేవాళ్లం: అప్పటి హీరోయిన్ రాశి

ఆరు బయటే దుస్తులు మార్చుకునేవాళ్లం: అప్పటి హీరోయిన్ రాశి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పడు హీరోయిన్ గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన రాశి.....చాలా కాలం తర్వాత లీడ్ రోల్ లో 'లంక' అనే సినిమా చేస్తోంది. శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని రోలింగ్‌ రాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నామన దినేశ్‌, నామన విష్ణుకుమార్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 21న సినిమా విడుదల కాబోతోంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ .... తన కెరీర్‌లో 'లంక' ఎంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా 75 సినిమాల్లో నటించినప్పటికీ అన్నీ ఒకే రకమైన పాత్రలు. 'లంక' మూవీలో తాను పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.

ఇపుడు హీరోయిన్లకు చాలా సుఖం

ఇపుడు హీరోయిన్లకు చాలా సుఖం

మా కాలంతో పోలిస్తే ఇప్పటి హీరోయిన్ల పని చాలా బెటర్, సుఖంగా ఉంది. ఇపుడు వారికి కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయి. అప్పట్లో కారా వ్యాన్స్‌ ఉండేవి కాదు. చెట్ల కింద ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకునే వాళ్లమని, ఊటీ లాంటి ఔట్‌డోర్‌లకు వెళ్లినప్పుడు ఆరుబయటే దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేదని రాశి తెలిపారు.

రెమ్యూనరేషన్ కూడా తక్కువే

రెమ్యూనరేషన్ కూడా తక్కువే

మా కాలంలో రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే. అపుడు మేము ఒక సినిమాకు తీసుకునే పారితోషికం ఇప్పుడు కొందరు హీరోయిన్లు ఒక్కరోజులో సంపాదిస్తున్నారు అని రాశి చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి

పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి

‘మా పాప పుట్టినరోజు సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ను కలిసేందుకు వెళ్లాను. నేను వచ్చిన విషయం తెలిసి వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారు. ‘గోకులంలో సీత' సినిమా సమ‌యంలో కన్నా ఇలా ఆయన్ను కలిసినప్పుడే ఎక్కువ సేపు మాట్లాడినట్లు రాశి తెలిపారు.

లంక

లంక

సరికొత్త కాన్సెప్టుతో 'లంక' సినిమా తెరకెక్కుతోందని, చంద్రముఖి సినిమాలో జ్యోతికకు ఎంత మంచి పేరొచ్చిందో.. 'లంక' సినిమాలో రాశికి కూడా అంతే పేరొస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

కాస్ట్ అండ్ క్రూ

కాస్ట్ అండ్ క్రూ

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!

English summary
Actress Raashi interview about Lanka movie. LANKA directed by Sri Muni, produced by Namana Dinesh and Namana Vishnu Kumar on Rolling Rocks Entertainments banner presented by Namanam Sankara Rao and Sundari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu