»   »  4 కోట్ల నగల కేసు: హాట్ హీరోయిన్ రంభ మళ్లీ వార్తల్లో...

4 కోట్ల నగల కేసు: హాట్ హీరోయిన్ రంభ మళ్లీ వార్తల్లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ అండ్ సెక్సీ అంద చందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో ఒకప్పుడు దక్షిణాదిని ఓ ఊపు ఊపిన తార రంభ. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన రంభ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రూ. 4 కోట్ల కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Actress Rambha's Jewellery case

రంభ సోదరుడు శ్రీనివాస్...ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు. తన సోదరి రంభకు సంబందించిన రూ. 4.5 కోట్ల విలువ చేసే ఆభరణాలను తన భార్య పల్లవి, ఆమె కుటుంబ సభ్యులు దొంగిలించారని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోదరి రంభ మూడేళ్ల క్రితం కెనడా వెళ్లిందని, రంభ నగలు తన ఇంట్లో ఉండగా తన భార్య పల్లవి, ఆమె సోదరి శాంతి సింగ్ చౌహాన్ తదితరులు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా కుమారుడికి కూడా నాకు దూరం చేసారు, ఇంత వరకు నాకు చూపించలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరకట్నం కేసుతో మొదలై నగల వ్యవహారం వైపు...

కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ భార్య పల్లవి తనను వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, ఆమె తల్లిదండ్రులపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు. అయితే రభ సోదరుడు శ్రీనివాస్ మాత్రం పల్లవి ఆరోపణలను ఖండించారు. పల్లవి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసారు. తాజాగా అతను నగలు విషయమై వారిపై ఫిర్యాదు చేసారు.

'పల్లవి అక్కకి ముంబైలో గోల్డ్ బిజినెస్ ఉంది. ఆమె షాపులో నగలు ప్రదర్శన కోసం రంభ నగలను తీసుకెళ్లింది. మళ్లీ అడిగితే ఎంతకూ తీసుకురాలేదు. చాలా కాలం తర్వాత నగలు మా ఇంటికి పంపకుండా హైదరాబాద్ పంపారు. పల్లవి వెళ్లి ఆ నగలు తీసుకొచ్చారు. అనుమానం వచ్చి చెక్ చేస్తే అవి నకిలీ నగలు అని తేలింది. ఇలా ఎందుకు చేసారు అని అడిగితే....మాపై వరకట్నం వేధింపులు అంటూ తప్పుడు కేసు పెట్టారు' అని అప్పట్లో శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

English summary
Rambha's Brother Srinivas lodged a complaint with Banjara Hills police accusing his wife Pallavi and her family members of robbing Rs 4.5 crore worth jewellery belonging to the Actress.
Please Wait while comments are loading...