»   » చైతూ.. నిన్ను విడిచి ఉండలేను.. రాజీ పడాల్సిందే.. సమంత భావోద్వేగం!

చైతూ.. నిన్ను విడిచి ఉండలేను.. రాజీ పడాల్సిందే.. సమంత భావోద్వేగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారసుడు నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది. చైతూతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నది. ఆయనతో గడిపిన మధురమైన క్షణాలను అభిమానులతో సోషల్ మీడియాతో పంచుకొంటున్నది. సమంత చేస్తున్న పోస్టులు అభిమానులను ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకరిపై మరొకరికి ఎంత ఇష్టమనే విషయాన్ని తెలియజేసేలా కొన్ని పోస్టులు ఉంటున్నాయి. అలాంటి పోస్ట్‌ను సమంత తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టారు.

నాగచైతన్య గుండెలపై సమంత..

నాగచైతన్య గుండెలపై సమంత..

నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఓ సినిమా షూటింగ్‌ కోసం నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లాల్సి వస్తున్నది. చైతూకి దూరమైపోవడం తనకేమాత్రం ఇష్టం లేనట్లుగా తనదైన శైలిలో సమంత పోస్ట్‌ చేశారు. ఒక సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి? అంటూ తనకు తానే ప్రశ్న వేసుకున్నారు.

తనకు తాను మూడు ప్రశ్నలు

తనకు తాను మూడు ప్రశ్నలు

వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ.. ‘నేను అనారోగ్యానికి గురవుతానేమో? అసలు నా విమానం టేకాఫ్‌ అవుతుందా?.. ప్లీజ్‌ నన్ను వెళ్లనివ్వొద్దు' అంటూ పోస్ట్‌ చేశారు. చైతూ మీద తనకున్న ఇష్టాన్ని.. అతన్ని వదిలి వెళ్లలేకపోవటాన్ని కవితాత్మకంగా పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నది. నాగచైతన్యతో సమంత అక్టోబర్ 6వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నారు. అందుకే పెళ్లికి ముందు మరింత చనువుగా మెలుగుతున్నారు.

రాజీ పడాల్సిందే..

రాజీ పడాల్సిందే..

నేను అనే కాదు, ఏ కథానాయికైనా ఆరంభంలో కథల విషయంలో రాజీపడాల్సిందే. కానీ ఇప్పుడు నచ్చిన కథల్నే ఎంపిక చేసుకొంటూ ప్రయాణం చేస్తుండడం చాలా బాగుంది. అలాగని ఇదివరకు చేసిన సినిమాల విషయంలో నాకెలాంటి అసంతృప్తి లేదు. వాటిని చేయడంతోనే కదా, నేనిక్కడిదాకా చేరుకొన్నా అని సమంత చెప్పారు.

అలా లెక్కలేసుకోవద్దు..

అలా లెక్కలేసుకోవద్దు..

సక్సెస్ అనగానే ప్రతీ ఒక్కరు బాక్సాఫీసు వసూళ్లను పరిగణనలోకి తీసుకొంటారు. కలెక్షన్లు, ఆర్థికంగా లభించిన ఆదరణని మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమా సక్సెస్ గురించి లెక్కలు వేస్తారు. కానీ నేను అలాంటి లెక్కలకి బహుదూరం. కొన్ని పాత్రలు వాటితో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసుల్లోకి చేరిపోతుంటాయి. వాటిని ఎలా తక్కువ చేసి చూడాలి? అలాంటి పాత్రలు నా కెరీర్‌లో చాలానే ఉన్నాయి అని సమంత పేర్కొన్నారు. పెళ్లికి ముందు సమంత రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం'లోనూ, నాగార్జున ‘రాజుగారి గది 2'లోనూ నటిస్తున్నారు.

English summary
Nagachaitanya, samantha enjoying the life every bit after thier engagement. Samantha gets emotional in social media recently. She posted feel good photo in Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu