»   » చైతూకు సమంత సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కాబోయే శ్రీవారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే..

చైతూకు సమంత సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కాబోయే శ్రీవారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ వారిచ్చే బహుమతిని బట్టి ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అనే విషయం బయటపడుతుంది. తాజాగా అలాంటి సంఘటనే టాలీవుడ్ లవ్‌బర్డ్స్ నాగచైతన్య, సమంతల మధ్య చోటుచేసుకొన్నది. నాగచైతన్య అభిరుచిని తెలుసుకొని తనకు ఇష్టమైన కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది సమంత. ఇటీవల చైతూ, సమంతకు నిశ్చితార్థ జరిగిన సంగతి తెలిసిందే. కాబోయే శ్రీవారికి ఖరీదైన బహుమతిని ఇచ్చి సంతోషంలో ముంచెత్తింది.

చైతూకి కార్లంటే ఇష్టం..

చైతూకి కార్లంటే ఇష్టం..

నాగచైతన్యకు విలాసవంతమైన కార్లంటే చాలా ఇష్టం. చూడటానికి చాలా నెమ్మదస్తుడిగా కనిపించినా వాయువేగంతో కార్లు నడిపిస్తాడని ఆ మధ్య రానా దగ్గుబాటి ఓ సందర్భంగా వెల్లడించాడు. సమంత అంటే ఇష్టమో.. కార్లన్నా అంత పిచ్చి అని సన్నిహితులు చెప్తుంటారు. కొత్తగా మార్కెట్‌లోకి కారు వస్తే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా చైతూ ఉండడని చెప్తుంటారు.

చైతూ గ్యారేజికి అదనపు ఆకర్షణ

చైతూ గ్యారేజికి అదనపు ఆకర్షణ

చైతూ పర్సన్ గ్యారేజ్‌లో చాలా రకాల కార్లు ఉన్నాయట. తాజాగా కాబోయే శ్రీమతి సమంత ఇచ్చిన కారు గ్యారేజికి అదనపు ఆకర్షణగా మారిందట. సమంత ఇచ్చిన గిప్ట్ కారు పక్కనే ఇష్టంగా ఫోజిచ్చి ఫోటోను షేర్ చేశాడు చైతూ..

బహుమతిగా బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు

బహుమతిగా బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు

ఇంతకీ సమంత ఇచ్చిన కారు ఏంటంటే. మార్కెట్లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు అట. దీని ఖరీదు దాదాపు రూ.కోటిన్నర అట. టీఎస్09 ఏఎక్స్ టీఆర్ 1290 నెంబర్‌తో ఉన్న ఈ కారుకు అప్పుడే పర్మనెంట్ నెంబర్ కూడా వచ్చినట్టు సమాచారం.

బర్త్ డే గిఫ్ట్‌గా..

బర్త్ డే గిఫ్ట్‌గా..

ఇంతకీ ఈ బహుమతిని చైతూకి ఎందుకు ఇచ్చారంటే.. సమంత ఇటీవల అంటే ఏప్రిల్ 28న బర్త్ డేను జరుపుకొన్నది. ఆ సందర్బాన్ని పురస్కరించుకొని ఈ ఖరీదైన కారును ఇచ్చి చైతూ ప్రేమను మరోసారి దక్కించుకొన్నది. తాజా బహుమతితో చైతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడట. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుకను నిర్వహించేందుకు నాగార్జున ప్రయత్నిస్తున్నారనేది సమాచారం. అందుకే వీరిద్దరూ తమ సినిమాలను పూర్తి చేసుకొనే పనిలో ఉన్నారు.

English summary
Actress Samantha, Naga chaitanya crazy lovers in south India, They got engaged recently. They are getting ready to wedding. Recently Samanth celebrated her birthday. so She gifted a BMW car to chaitu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu