twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్ వేధించాడు.. ఆ రోజంతా.. కంటతడితోనే.. నటి సన

    |

    తెలుగు సిని పరిశ్రమలో అక్క, వదిన, తల్లి పాత్రలతో ఆకట్టుకొంటున్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో సనా ఒకరు. సనా అసలు పేరు షానూర్ సనా బేగం. నిన్నే పెళ్లాడుతా చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సన ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో ఎన్నోచిత్రాల్లో నటించారు. ఇటీవల ప్రముఖ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనా సెన్సేషనల్ విషయాన్ని వెళ్లడించారు. కన్నడ డైరెక్టర్ వేధింపుల గురించి, పడిన ఆవేదన గురించి పంచుకొన్నారు. సన వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

    కన్నడ సినిమా పరిశ్రమలో

    కన్నడ సినిమా పరిశ్రమలో

    కన్నడ డైరెక్టర్ వేధింపుల గురించి నటి సనా మాట్లాడుతూ.. సాధారణంగా ఏ భాష నుంచి నటీనటులు వచ్చిన వారిని చక్కగా ఆదరిస్తారు. కానీ కన్నడ వాళ్లు ఇతర భాషా నటులను ఆదరించరు. అప్పటికే నేను రెండు, మూడు సినిమాలు చేసినా నాకు ఓ డైరెక్టర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

    పర భాషా నటులంటే

    పర భాషా నటులంటే

    తమిళం, మలయాళంలో ఇలాంటి సమస్య ఉండదు. అయితే ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులైన వారు ఉంటే వేరే భాష నుంచి ఎందుకు తెస్తారనే భావన వారిలో ఉంటుంది. వారికి ఇతర భాష నటులంటే సరిగా పడదు.

    ఆ డైరెక్టర్‌కు మొదటి నుంచి

    ఆ డైరెక్టర్‌కు మొదటి నుంచి

    నేను నటించిన మూడు సినిమాలు ఆ భాషలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ వర్గాల మనోభావాలకు విరుద్ధంగా నన్ను ఓ సెంటిమెంట్‌గా ఓ కీలకపాత్రలో నన్ను పెట్టుకొన్నారు. ఆ చిత్రంలో దొడ్డన్న లాంటి సీనియర్ నటులు ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ.. ఆ సినిమా డైరెక్టర్‌కు ముందు నుంచే కోపం ఉన్నట్టు కనిపించింది.

    సింగిల్ షాట్‌లో ఒకే కావాలి

    సింగిల్ షాట్‌లో ఒకే కావాలి

    ఓ సీన్‌లో నాకు ఒక పేజ్ మొత్తం ఉన్న డైలాగ్స్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ప్రాప్టింగ్ ఉండదు. సింగిల్ షాట్‌లోనే ఓకే చేయాలి అని నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఎలానో అలా పేజ్ డైలాగ్స్ మొత్తం గుర్తించుకొని సీన్ పూర్తి చేశాను. కానీ ఏంటీ ఆ భాష అంటూ నాపై అరిచారు.

    నేను చెప్పిన డైలాగ్‌లో తప్పులు లేవు

    నేను చెప్పిన డైలాగ్‌లో తప్పులు లేవు

    సీన్‌లో సీనియర్ నటులు దొడ్డన్న, ఇతరులు ఉన్నారు. నెత్తిపైనా తీవ్రంగా ఎండ ఉంది. బ్రేక్ టైమ్ అయిపోయింది. బ్రేక్ చెబుతారేమో అని అందరూ చూస్తున్నారు. కానీ డైరెక్టర్ సాధిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్పిన డైలాగ్స్‌లో ఎలాంటి తప్పులు లేవు. ఒకవేళ చిన్న తప్పులు ఉన్నా వాటిని డబ్బింగ్‌లో చెప్పుకోవచ్చు. కానీ కావాలని నాపై ఏదో కక్ష సాధింపుగా నన్ను తిట్టి వెళ్లిపోయాడు.

    డైరెక్టర్ తీరుతో బాధపడ్డా డైరెక్టర్ తీరుతో బాధపడ్డాను

    డైరెక్టర్ తీరుతో బాధపడ్డా డైరెక్టర్ తీరుతో బాధపడ్డాను

    డైరెక్టర్ తీరుతో నేను చాలా బాధపడ్డాను. ఆ రోజంతా ఏడుస్తూ కూర్చున్నాను. అప్పటికే నేను 10 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు చేశాను. అలాంటి దానిని కావాలని ఏడిపించాడు. ఎందుకు అలా చేశాడో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు.

    English summary
    Sana aka Shanoor Sana Begum is an Indian actress, who is working in Telugu, Kannada and Tamil film industry. She was born on 22nd March in Hyderabad, Telangana. Sana made her acting debut in the Telugu film “Ninne Pelladata” along with Akkineni Nagarjuna, directed by Krishna Vamsi and produced by Annapurna Studios. In one situation, she encounter mis behave from Kannada Director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X