»   » ఎన్‌కౌంటర్: పోలీసులకు సెల్యూట్ కొట్టిన హీరోయిన్

ఎన్‌కౌంటర్: పోలీసులకు సెల్యూట్ కొట్టిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న నల్లగొండ జిల్లాలో జరిగిన సంఘటనలో సిమి ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలోని సూర్యాపేట బస్టాండ్ వద్ద జరిగిన ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులను మరణించగా.... తుంగతుర్తి మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ మరణించగా ఎస్ ఐ, సీఐ తీవ్రంగా గాయపడ్డారు.

అతి ప్రమాదకరమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వైనంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువుత్తాయి. ఈ సంఘటనపై నటి సంజన కూడా సటించింది. ‘సూర్యపేట, జానకీపురం ఫైరింగ్ లో ప్రాణత్యాగం చేసిన, గాయపడ్డ పోలీసులకు గ్రాండ్ సెల్యూట్' అంటూ ట్వీట్ చేసింది.

Actress Sanjjanaa salutes police

సంజనతో పాటు యావత్ దేశ ప్రజలంతా పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసులకు నివాళులు అర్పించారు.

మరో వైపు తాజాగా మంగళవారం మరో సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ జైలు నుండి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వికారుద్దీన్ తో సహా ఐదుగురు సిమి ఉగ్రవాదులను తీసుకొస్తుండగా వారు పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేసారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు.

English summary
‘A grand salute to all the policemen who injured & sacrificed their lives for us at #Suryapet and #Janakipuram firing’ Sanjjanaa tweeted.
Please Wait while comments are loading...