»   »  ఘనంగా హీరోయిన్ శరణ్య మోహన్ వివాహం (ఫోటోస్)

ఘనంగా హీరోయిన్ శరణ్య మోహన్ వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో పాటు ‘విలేజ్‌లో వినాయకుడు', ‘హ్యాపీ హ్యాపీగా' చిత్రాల్లో కథానాయికగా నటించి హీరోయిన్ శరణ్య మోహన్ వివాహం ఆదివారం కేరళలో గ్రాండ్ గా జరిగింది. కేరళకు చెందిన అరవింద్ కృష్ణన్ అనే ఓ వైద్యుడిని ఆమె వివాహమాడింది.


జులై 12న వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అరవింద్ కృష్ణన్ తో పెళ్లి విషయాన్ని శరణ్య తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా వెల్లడించింది. శరణ్య, అరవింద్ చిన్న నాటి నుండి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కేరళకి చెందిన శరణ్య అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకొంది.

తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలే లేక పోవడంతో ఇతర పాత్రలు సైతం చేసింది. కత్తి చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లిగా నటించింది. తెలుగులో అవకాశాలు లేక పోవడంతో తమిళ, మళయాలం చిత్రాల వైపు మళ్లింది. అక్కడ కూడా ఆమె కెరీర్ ఆశించిన స్థాయి లేదు. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయింది.

స్లైడ్ షోలో ఫోటోలు...

వివాహం

వివాహం


శరణ్య-అరవింద్ వివాహం కేరళలో గ్రాండ్ గా జరిగింది.

అందాల బొమ్మ

అందాల బొమ్మ


పెళ్లి వేడుకలో శరణ్య అందాల బొమ్మలా మెరిసి పోయింది.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


శరణ్య, అరవింద్ చిన్న నాటి నుండి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

గ్రాండ్ గా పార్టీ

గ్రాండ్ గా పార్టీ


పెళ్లి అనంతరం శరణ్య-అరవింద్ దంపతులు తమ స్నేహితులకు, సన్నిహితులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నారు.

English summary
South actress Saranya Mohan got married to Dr Aravind Kirshnan in Alappuzha on Sunday. The two got engaged in July this year.
Please Wait while comments are loading...