»   » నటి షాలు మీనన్‌‌కు నో బెయిల్!

నటి షాలు మీనన్‌‌కు నో బెయిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shalu Menon
తిరువనంతపురం : కేరళ సోలార్ ప్యానెల్ కుంభకోణంలో మళయాల టెలివిజన్ నటి, డ్యాన్సర్ షాలు మీనన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. బుధవారం వరకు ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆమె తరుపు న్యాయవాది ఆమె ఒక పబ్లిక్ ఫిగర్, ఈ కేసులో అనవసరంగా ఇరికించారు అని వాదించినప్పటికీ సరైన ఆధారాలు లేక పోవడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది.

గత నెల రోజులుగా సోలార్ ప్యానెల్ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఆమె పేరు నానుతూ వస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు బిజూ రాధాకృష్ణన్‌తో ఆమెకు సంబంధాలున్నాయంటూ దుమారం చెలరేగుతోంది. గత శుక్రవారం షాలు మీనన్‌ను అరెస్టు చేసారు.

పోలీసులు కొట్టాయం సమీపంలోని చంగనసెస్సెరీలో గల ఆమె నివాసానికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను ఎడిజిపి హేమచంద్రన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చెంగన్నూరు తీసుకుని వెళ్లింది. షాలుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిసూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. బిజూ రాధాకృష్ణన్‌ రాష్ట్రం నుంచి పారిపోవడానికి ఆమె సహకరించడానికి సిద్ధపడినట్లు పోలీసులు అనుమానించారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన భార్య మృతి కేసులో కూడా బిజూ కోసం పోలీసులు వేట సాగిస్తూ వచ్చారు.

English summary
Actress Shalu Menon was rejected the bail by the court yesterday with regard to the solar scam scandal. She has been sent to the police custody till Wednesday. Her counsel argued that she is a public figure and that she has been dragged into the scandal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu