»   » అడల్ట్ ఫిల్మ్ లలో నటనే....హీరోయిన్ కాపురంకు దెబ్బ ,పోలీసుల దగ్గరకు

అడల్ట్ ఫిల్మ్ లలో నటనే....హీరోయిన్ కాపురంకు దెబ్బ ,పోలీసుల దగ్గరకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తన నుంచి దూరం చేసారంటూ.. సినీనటి సిరిప్రియ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసుల్ని ఆశ్రయించింది. వారం క్రితం సామర్లకోటకు చెందిన ప్రసన్న కుమార్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. సిరిప్రియ నటించి 'ఆమె కోరిక' సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్ లోనూ సిరిప్రియ నటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..సిరిప్రియ అసలు పేరు చంద్రకళ. ప్రసన్న కుమార్ ఫేస్ బుక్ లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో గత ఆరేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెద్దలు వద్ద పెట్టారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారం క్రితం వివాహం చేసుకున్నారు.

Actress Siri Priya approaches police for protection

ప్రసన్న కుమార్ ..బీటెక్ చదువుతున్నాడు. అయితే ప్రసన్నకుమార్ ను తాను వివాహం చేసుకున్నానని అయితే తన భర్త కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున రక్షించాలని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులకు ఆమె విన్నవించింది.

సిరిప్రియ మాట్లాడుతూ..తాను గతంలో యూట్యూబ్ లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశానని తెలిపింది. అయితే వృత్తిలో భాగంగా చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రసన్న కుమార్ కుటుంబం తన క్యారెక్టర్ ను అనుమానిస్తోందని సిరిప్రియ వ్యాఖ్యానించింది.

తను ప్రసన్నకుమార్ ను వలలో వేసుకోలేదని ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. బతుకుదెరువు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని త్వరలో ఏదో ఒక పని చూసుకుంటానని సిరిప్రియా తెలిపింది.

English summary
Film actress Siri Priya has appraoched Rajanagar police in East Godavari district for protection from the parents of Prasanna Kumar, a B.tech student, who she married recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu