»   »  మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ స్నేహ

మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ స్నేహ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ స్నేహ గర్భం ధరించిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో స్నేహ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని స్నేహ భర్త, నటుడు ప్రసన్న తెలిపారు. స్నేహ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు.

Actress Sneha Blessed With Baby Boy

వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు చిత్రాల ఫేం స్నేహ తన సహ నటుడు ప్రసన్నను పెళ్లాడిన సంగతి తెలిసిందే. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగిన సంగతి తెలిసిందే. 'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా ఆమె తల్లయిన నేపథ్యంలో కొన్నేళ్ల వరకు ఆమె సినిమాల్లో కనిపించే అవకాశం లేదు.

Actress Sneha Blessed With Baby Boy

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత స్నేహ సినిమాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. ప్రస్తుతం స్నేహ-ప్రసన్న దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

English summary
Actress Sneha has given birth to a baby boy in Chennai last night. Both the baby and the mother are doing fine and this pleasant news has been revealed by Sneha’s actor husband, Prasanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu