»   » వ్యాపార వేత్తతో నటి ఊర్వశి రెండో వివాహం

వ్యాపార వేత్తతో నటి ఊర్వశి రెండో వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా సినిమా రంగంలో గత 30 ఏళ్లుగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ వస్తున్న తమిళ నటి ఊర్వశి రెండో వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన శివ ప్రసాద్ అనే వ్యాపార వేత్తను ఆమె తాజా పెళ్లాడారు. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న శివప్రసాద్...ఊర్వశి సోదరుడు కమల్‌కు క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది.

గత కొన్ని రోజుల క్రితమే వీరి వివాహం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఊర్వశి తాజాగా ఈ విషయాన్ని కేరళకు చెందిన వనిత అనే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'శివప్రసాద్ నా సోదరుడు కమల్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా ఏళ్లుగా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండు. మాలో ఒకరిగా కలిసిపోయారు' అని ఊర్వశి వెల్లడించారు.

 Actress Urvashi's second marriage with industrialist

ఊర్వశి మొదటి వివాహం విషయానికొస్తే....మళయాలం నటుడు మనోజ్ కె జయంత్‌ను ఆమె 2000 సంవత్సరంలో పెళ్లాడారు. 2008లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. మనోజ్ ఇటీవల(2011) ఆశా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఊర్వశి-మనోజ్‌ల దాంపత్యం ద్వారా జన్మించిన కూతురు ఇపుడు మనోజ్ వద్దే ఉంటోంది. శివప్రసాద్‌‍ను రెండో వివాహం చేసుకునే ముందు ఊర్వశి తన కూతురు నుండి అంగీకారం పొందినట్లు తెలుస్తోంది.

ఊర్వశి సినిమా జీవితానికి గురించిన వివరాల్లోకి వెళితే....1980ల్లో సినిమా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన ఆమె మళయాలం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె రుస్తుం, జీవన పోరాటం, చెట్టుకింద ప్లీడర్, సందడే సందడి, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, స్వరాభిషేకం, చక్రం చిత్రాల్లో నటించింది.

English summary
Popular actress Urvashi has reportedly tied the knot once again. The actress has reportedly married Shivaprasad, a Chennai-based businessman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu