»   » ఆ నిర్మాతల తో పని చేయను: మరో హీరోయిన్ సంచలన ట్వీట్

ఆ నిర్మాతల తో పని చేయను: మరో హీరోయిన్ సంచలన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొద్ది కాలంగా సౌతిండియాలో పెరిగిపోతున్న కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై నటీ నటులు నోరు విప్పుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పటానికి జంకటం లేదు. ముఖ్యంగా నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలు కథలుగా కథనాలు ప్రచారం జరుగుగుతున్నాయి. రీసెంట్ గా అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపులు గురించి నటి రెజీనా చెప్పింది,

వరలక్ష్మీ శరత్‌కుమార్

వరలక్ష్మీ శరత్‌కుమార్

ఒక ఛానల్‌ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. ప్రముఖ టీవీ చానల్ లో ఫ్రోగ్రామింగ్ హెడ్ తో సమావేశంలో పాల్గొన్నాను.

బయట కలుద్దామని అన్నాడు

బయట కలుద్దామని అన్నాడు

మరో అరగంట తర్వాత మీటింగ్ ముగుస్తుందనే సమయానికి అతడు నాతో మనం బయట కలుద్దామని అన్నాడు, ఎందుకు అని అడిగితే వేరే విషయాల గురించి అన్నాడు... అప్పుడు అతడి మనసులో ఉన్న దురుద్దేశం అర్థమై అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్లినట్లు వరలక్ష్మి చెప్పింది.

లైంగిక వేధింపుల వ్యవహారం

లైంగిక వేధింపుల వ్యవహారం

ఇలా హీరోయిన్లపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలతో సంచ లనం సృష్టించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ తాజాగా పరిశ్రమలోని పురుషాధిక్యతపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమిళంలో విజయం సాధించిన ‘అప్పా' చిత్రాన్ని మలయాళంలో ‘ఆకాశ మిట్టాయ్‌' పేరుతో రీమేక్‌ చేస్తు న్నారు. సముద్రగని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయరాంకు జోడీగా వరలక్ష్మిని ఎంపిక చేశారు.

ఆకాశ మిట్టాయ్‌

ఆకాశ మిట్టాయ్‌

మూడు రోజుల క్రితం జరిగిన షూటింగ్‌ ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొంది. ఆ తరువాత ఏం జరిగిందోగానీ ఇంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీనిపై ఆమె స్పం దిస్తూ.. ‘ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను. ఈ నిర్మాతలతో పనిచేయడం నాకిష్టం లేదు.

సభ్యత లేనిచోట పనిచేయడం కష్టం

సభ్యత లేనిచోట పనిచేయడం కష్టం

ఎందుకంటే సంస్కారం, సభ్యత లేనిచోట పనిచేయడం కష్టం. అయితే నా నిర్ణయాన్ని అర్ధం చేసుకున్న సముద్రగని, జయంరాలకు కృతజ్ఞతలు. వారిద్దరితో భవిష్యత్తులో తప్పకుండా పనిచేస్తాను. ప్రస్తుతం నేను రెండు మలయాళ సినిమాల్లో నటిస్తున్నా' అని చెప్పింది. వరలక్ష్మి మాటలు ఇప్పుడు పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాయి.

English summary
Varalaxmi tweeted: "Thank you Samuthirakani sir and Jayaram sir for having supported my decision. I can't work with male chauvinists and mannerless producers."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu