»   » ప్రాణాలతో గట్టెక్కిన హీరోయిన్, ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్య

ప్రాణాలతో గట్టెక్కిన హీరోయిన్, ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ హీరోయిన్ వింధ్య ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 70కి పైగా నిద్రమాత్రలు మింగిన ఆమె చికిత్స అనంతరం ప్రాణాలతో బయట పడింది. ఇపుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జి చేసారు. వ్యక్తిగత కారణాలతో ఆమె మార్చి 4వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వింధ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందనే విషయం గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను బెంగుళూరు శివాజీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిచారు. ఆమెను బ్రతికించేందుకు చికిత్స చేసిన వైద్యులు దాదాపు మూడు రోజులు పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆదివారం (మార్చి 9)న ఉదయం డిశ్చార్జి చేసారు.

ఆత్మహత్యాయత్నం సంఘటనపై స్పందించేందుకు వింధ్య నిరాకరించారు. భవిష్యత్‌లో తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని ఆమె తెలిపారు. సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ఇపుడు బాధ పడుతున్నానని, ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె తెలిపారు. వింధ్య తల్లిదండ్రులు గత కొంతకాలంగా దృష్టి సంబంధ లోపంతో బాధ పడుతున్నారు. వింధ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సమయంలో ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

 Actress Vindhya Is Out Of Danger, Discharged From Hospital

మనెదమరయల్లి అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన వింద్య అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మంజునాథ్‌తో స్నేహం చేసింది. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే మంజునాథ్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని వింద్య తల్లిందండ్రులు రంగస్వామి, నాదమ్మ ఆరోపిస్తున్నారు.

మంజునాథ్ అసలు స్వరూపం తెలియడంతో వింధ్య గత కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోందని, దీంతో మంజునాథ్ ఫోన్లో వేధించడం మొదలు పెట్టాడని, మంగళవారం ఉదయం అతని నుండి కాల్ రావడంతో మాట్లాడిన వింద్య అనంతరం గదిలోకి వెళ్లి ఏడ్చిందని, అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తెలుస్తోంది.

English summary
Sandalwood's young actress Vindhya, who had recently made a suicide attempt is out of danger, and has been discharged from the hospital. The actress, who was hurt by the gossips that were spoiling her image in society, had reportedly consumed more than 70 sleeping pills and tried to commit suicide on March 4.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu