»   »  కళ్లు తిప్పుకోలేరు :చెమటలు కారేలా జిమ్ లో కష్టపడుతున్న మన హీరోయిన్స్ (ఫొటోలు)

కళ్లు తిప్పుకోలేరు :చెమటలు కారేలా జిమ్ లో కష్టపడుతున్న మన హీరోయిన్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకప్పుడు హీరోయిన్స్ లా ఇప్పటితరం వాళ్ళు ఉండటానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా చబ్బీ లుక్ ని మొదటే వద్దంటున్నారు. అందుకోసం డైలీ జిమ్, యోగా అంటూ చెమటలు కారుస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ టాలీవుడ్ లోని హీరోయిన్స్ కు చేరింది.

తెలుగులో వరస సినిమాలతో దూసుకుపోతున్న రాశి ఖన్నా కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకుంది. జిమ్ లో ఏ స్దాయిలో కష్టపడిందో చెమటలు కక్కుతూ మరీ ఫొటో పెట్టింది. మీరు ఇక్కడ ఆమె ఫొటో తో పాటు కామెంట్ కూడా చూడవచ్చు.

'వర్కవుట్ చేస్తున్నా.. దీని సైడ్ ఎఫెక్ట్స్ లో చెమట.. ఆనందం.. ఓ అద్భుతమైన ఫీలింగ్ కూడా ఉంటాయ్' అంటోంది రాశి.

యోగ మనిషి జీవన విధానం. యోగాభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ, సంతోష, ఆనందాల్ని నింపుతుంది. అందుకే తమ లుక్స్ బాగుండేందుకు, హీరోయిన్స్ రోజూ యోగాసనాలు వేస్తూంటారు. అలా ఫిట్ గా ఉంటూ యోగాసనాలు వేసే హీరోయిన్స్ ని ఓ సారి గుర్తు చేసుకుందాం.

అలాగే ..తాము యోగాభ్యాసం చేయడమే కాకుండా నటీమణులు శిల్పాసెట్టి వంటి వారు యోగా సెంటర్స్ నడుపుతున్నారు. హీరోయిన్ అనుష్క యోగా టీచర్ . అలాగే రెజీనా, సమంత, శ్రేయ వంటి వారు కూడా యోగా చేస్తున్నారు. ముఖ్యంగా బాడీ స్లిమ్ గా ఉండాలంటే యోగా తప్పనిసరి. యోగాతోనే యోగం ఉంటుందనేది నిజం.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

ఈ తరం హీరోయిన్స్ లో చాలా ఫిట్ గా ఉండే హీరోయిన్ రాశి ఖన్నా..ఆమె రోజూ యోగాభ్యాసం చేస్తూంటుంది.

త్రిష

త్రిష

ఈ చెన్నై బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్ యోగానే అని చాలా సార్లు చెప్పింది. రోజూ చేస్తూనే ఉంటానంటోంది.

హన్సిక

హన్సిక

తను స్లిమ్ గా ఉండటానికి ప్రధాన కారణం యోగానే అని చెప్తూంటుంది హన్సిక.

అనుష్క

అనుష్క

సినీ పరిశ్రమలోకి రాకముందు అనుష్క ..ఓ యోగా టీచర్ అనే సంగతి మీకు తెలుసా

అమీషా పటేలా

అమీషా పటేలా

ఎప్పుడో బద్రి చిత్రంలో పవన్ సరసన చేసిన అమీషా ఈ రోజుకూ తన బాడీని ఫిట్ గా ఉంచుకోవటానికి కారణం యోగానే.

శిల్పాశెట్టి

శిల్పాశెట్టి

ఇక యోగాకు, శిల్పా శెట్టి కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె డీవిడిలు సైతం రిలీజ్ చేసింది.

కరీనాకపూర్

కరీనాకపూర్

బాలీవుడ్ ని ఏలుతున్న కరీనా కపూర్..యోగా చెయ్యందే ఉదయం బయిటకే రాదట.

కాజల్

కాజల్

కొత్తగా చెప్పేదేముంది. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉండటానికి కారణం యోగానే అంటుంది కాజల్

నమిత

నమిత

తనకు యోగా అంటే చాలా ఇష్టమని, దాన్ని ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానంటోంది నమిత.

నగ్రీస్ ఫక్రి

నగ్రీస్ ఫక్రి

బాలీవుడ్ హీరోయిన్ నగ్రీస్ ఫక్రీ...ఎంత అందంగా ఉంటుంది, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటే తడుముకోకుండా యోగా నే అంటుంది.

పూనమ్ పాండే

పూనమ్ పాండే

ఈమెకు సైతం యోగా అంటే బాగా మక్కువట. తన బాడీ స్లిమ్ గా, యాక్టివ్ గా ఉండటానికి కారణం యోగానే అంటుంది

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

డైలీ ఎక్సరసైజ్ తో పాటు యోగా చేస్తానంటోంది మంచు లక్ష్మి. ఆమె కూడా ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది.

దీపిక పదుకోని

దీపిక పదుకోని

బాలీవుడ్ లో వెలుగుతున్న దీపిక పదుకోని, తన స్నేహితులకు సైతం యోగా నేర్పుతుందిట. ఖాళీ సమయాల్లో

రాశిఖన్నా

రాశిఖన్నా

ఏదైనా ఓ రోజు సెట్లో గందరగోళంగా, అసంతృప్తిగా కనిపించానంటే ఆ రోజు నేను యోగా చేయనట్టే లెక్క'' అంటోంది రాశిఖన్నా

శ్రియ

శ్రియ

నన్ను ఎంతో మంది అడుగుతూంటారు..మీ ఆరోగ్య రహస్యం ఏమిటని,యోగా డైలీ చేయటమే నా బ్యూటీ సీక్రెట్ అంటోంది బ్యూటి

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌

యోగా సాధనతో శారీరక ఆరోగ్యం కలగడంతో పాటు కాదు ఒత్తిడి చాలా తగ్గిపోతుంది. రోజుకి గంట చొప్పున వారానికి ఐదు సార్లు యోగా చేస్తాను. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి వివిధ రకాల ఆసనాలు వేస్తాను అంటోంది.

ఇలియానా

ఇలియానా

రోజుకి ఒక్క గంట సేపు యోగా చేసి చూడండి... మీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఏకాగ్రతకు, క్రమశిక్షణకు యోగా అద్భుతమైన మార్గం అంటోంది ఇలియానా

English summary
Most of actress do yoga to stay fit and healthy. It’s true that plenty of Tollywood stars practice yoga regularly . Yoga is a much-loved fitness formula for celebs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu