»   » అవేమైనా టాయిలెట్ పేపర్లా?, హీరోయిన్లపై పివిపి ఫైర్..

అవేమైనా టాయిలెట్ పేపర్లా?, హీరోయిన్లపై పివిపి ఫైర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల తీరుపై ప్రముఖ నిర్మాత, సినీ ఫైనాన్షియర్ ప్రసాద్ వి పొట్లూరి మండి పడ్డారు. ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ ఉన్నట్టుండి తమ సినిమా ప్రాజెక్టు నుండి తప్పుకుని కాంట్రాక్టును ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన అప్ సెట్ అయ్యారు. ఇప్పటి హీరోయిన్లు ‘కాంట్రాక్టు' పేపర్లను టాయిలెట్ పేపర్లలా ఉపయోగిస్తున్నారంటూ మండి పడ్డారు.

నాగార్జున-కార్తి మల్టీ స్టారర్ మూవీ నుండి శృతి హాసన్ ఉన్నట్టుండి తప్పుకున్న నేపథ్యంలో పివిపి సహనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక శృతి హాసన్ స్థానంలో తమన్నాను తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7, 2015 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమిళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు. శృతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్ ను ఆదేశించింది.

 Actresses treat the 'Contract' as a toilet paper: PVP

కేసు ఎందుకు పెట్టారు...?
శృతి హాసన్ షూటింగుకు రాక పోవడం వల్ల తమకు ఫైనాన్సియల్ లాస్, రిప్యుటేషన్ లాస్ అయిందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేసారు. కోట్లాదిరూపాయల డబ్బు, రిప్యుటేషన్ పోవటంతో పాటు తమ సమయం కూడా చాలా వృధా అయిందని, దీని వలన బిజిగా ఉన్న మిగతా ఆర్టిస్టుల షెడ్యుల్ దెబ్బ తిని లాస్ చాలా ఉంటుందని మండి పడ్డారు.

శృతి హాసన్ చర్యపై నిర్మాతలు వారు కోర్టును ఆశ్రయించి ఆమెపై సివిల్ మరియు క్రిమినల్ పొసీడింగ్స్ జరపమని కోరారు. దాంతో కోర్టు వారు...ఆమె ఏ కొత్త చిత్రం సైన్ చేయకూడదని, పోలీస్ లు ఈ కేసుపై ఇన్విస్టిగేషన్ చెయ్యాలని కోరారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళం, తెలుగులో నిర్మితమవుతున్న చిత్రంలో నాగార్జున, కార్తి కలిసి నటిస్తున్నారు. ఇందులో కార్తికి జంటగా నటించడానికి శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, చెన్నైలోనూ జరిగింది. ఇప్పటికే తమిళంలో విజయ్‌, తెలుగులో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్న శృతి హిందీలో గబ్బర్‌' సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. వీటితో బిజీగా ఉండటంతో కాల్షీట్ల సమస్య తలెత్తిందని శృతి హాసన్ వాదిస్తోంది.

English summary
PVP who was really upset with the unprofessional behaviour of Shruti Haasan commented Actresses treat the 'Contract' as a toilet paper in Film Industry. He, however, pledged to follow rules strictly being the head of a Corporate Organization.
Please Wait while comments are loading...