»   » అత్తారింటికి దారేది లాభాల్లో నిర్మాతకు మిగిలేది ఎంత?

అత్తారింటికి దారేది లాభాల్లో నిర్మాతకు మిగిలేది ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 48 కోట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 78 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

ఇప్పటి వరకు మొత్తంగా రూ. 30 కోట్ల వరకు లాభం వచ్చింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వాటాపోను నిర్మాతకు ఇప్పటి వరకు కనసీ రూ. 15 కోట్లు మిగిలినట్లు తెలుస్తోంది. చిత్రం 100 కోట్ల వసూళ్లు సాధిస్తే ఈ మొత్తం మరింత పెరిగడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి సినిమా పైరసీ జరుగకుండా ఉంటే లాభాలు మరింత ఎక్కువగా వచ్చేవి అనేది ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం.

తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan kalyan's Attarintiki Daredi which was released worldwide on 27th September, gained some huge collections and profits.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu