»   » 'ఆరడుగుల బుల్లెట్' పవన్ కాదా..మరి ఎవరు? (ఫొటో ఫీచర్)

'ఆరడుగుల బుల్లెట్' పవన్ కాదా..మరి ఎవరు? (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్యన పవన్ కళ్యాణ్ చిత్రాల్లోని హిట్ పాటల నుంచి...ఓ వాక్యమో, పదమో తీసుకుని టైటిల్స్ గా పెట్టడం క్రేజ్ గా మారింది. తాజాగా పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ అధినేత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తాజాగా ఆ చిత్రంలో హీరోని వర్ణిస్తూ సాగే పాటలోని 'ఆరడుగుల బుల్లెట్' అనే మాటనే టైటిల్‌గా ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఏ హీరోతో ఈ సినిమాని ఆయన నిర్మిస్తారన్నది ఆసక్తికరం గా మారింది. 'ఆరడుగుల బుల్లెట్' గా ఇదే బ్యానర్ లో నెక్ట్స్ చేసే హీరో సినిమా ఉంటుందని చెప్తున్నారు. అది పవన్ కళ్యాణ్ మాత్రం కాదని, ఎవరనేది ఇంకా తెలియదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.

టైటిల్ అనేది సినిమాకు ఓ క్రేజ్ తెచ్చే ఎలిమెంట్. పెద్ద హీరోల సినిమాలకు హీరోని టార్గెట్ చేస్తూ టైటిల్స్ పెడతారు. అలాగే చిన్న హీరోల సినిమాలకు ఆ సినిమా కాన్సెప్ట్ ని బట్టి టైటిల్స్ పెట్టి ఆసక్తి క్రియేట్ చేస్తూంటారు. అంతేగాక జెనర్ ని బట్టి కూడా టైటిల్స్ మారిపోతూంటాయి. టైటిల్స్, ప్రోమోలతోనే క్రేజ్ క్రియేట్ అయ్యి, హీరోలతో సంభంధం లేకుండా ..థియోటర్స్ కు ఓపినింగ్స్ కూడా చాలా సార్లు వస్తూంటాయి.

అందులోనూ ఈ మధ్య కాలంలో టైటిల్స్ కీలక అంశంగా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు అయితే సినిమా ప్రారంభమైన నాటి నుంచీ రకరకాల టైటిల్స్,డిజైన్స్ తో సహా ప్రచారంలోకి వస్తున్నాయి. చాలా సార్లు అవే టైటిల్స్ ని దర్శక,నిర్మాతలు ఫైనల్ కూడా చేస్తున్నారు. అచ్చ తెలుగులో టైటిల్స్ పెట్టాలని కొందరు భావిస్తూంటే, తెలుగు,ఇంగ్లీష్ ఏముంది...జనాల్ని ఆకట్టుకోవటం ప్రదానం అన్నట్లు గా డిజైన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెలలో... రకరకాల వైవిధ్యమైన టైటిల్స్ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయ్యియి.

ఆ టైటిల్స్ ఏమిటి..బ్యానర్ ఏమిటి..అనేది స్లైడ్ షో లో...

'మిర్చి' బ్యానర్...

'మిర్చి' బ్యానర్...

ప్రభాస్ హీరోగా నిర్మించిన 'మిర్చి'తో చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన యు.వి. క్రియేషన్స్ సంస్థ తమ తదుపరి ప్రాజెక్టు కోసం 'రన్ రాజా రన్' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసింది. ప్రభాస్ కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసారా లేక వేరే హీరోతో చేస్తారా అనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతానికి అయితే ఓ మంచి టైటిల్ ని రిజిస్టర్ చేసారని చెప్తున్నారు.

'1.. నేనొక్కడినే'

'1.. నేనొక్కడినే'మహేశ్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న '1.. నేనొక్కడినే' సినిమా మలయాళంలో '1.. ఎంజన్ ఒరువన్' పేరుతో రిలీజ్ కానుంది. ఈ మేరకు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ టైటిల్‌ను నమోదు చేసింది. తమిళ,మళయాళ,తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే సారి రిలీజ్ చేద్దామనే ఐడియా నిర్మాతలది కావటంతో అక్కడా టైటిల్స్ రిజిస్టర్ చేస్తున్నారు.

నాగ్ 'సూపర్' ని...

నాగ్ 'సూపర్' ని...

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'సూపర్' సినిమా తమిళంలో 'పురుచ్చివరన్' పేరుతో విడుదల కానుంది. ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ జరిగింది. నాగార్జున గత చిత్రాలు అక్కడ వరసగా విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా భాయ్ చిత్రం తమిళంలోనూ విడుదలకు రెడీ చేస్తున్నారు.

దాసరి కొత్త టైటిల్...

దాసరి కొత్త టైటిల్...

దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియా ప్రై.లి. బేనర్ 'పితృదేవోభవ' టైటిల్‌నూ, తారక ప్రభు ఫిలిమ్స్ 'క్షత్రియ వంశం' టైటిల్‌నూ రిజిస్టర్ చేయించాయి. ‘పితృదేవోభవ'ని నిర్మాత యలమంచలి సాయిబాబు నిర్మించే అవకాసం ఉంది. ఆయన చెప్తూ... ‘ నాకు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. నా తదుపరి సినిమా దాసరి గారి దర్శకత్వంలో ఉంటుంది. ఈ సినిమాకి ‘పితృదేవోభవ' అనే టైటిల్ ని ఖరారు చెసాము. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని' ఆయన సమాధానం ఇచ్చారు.

సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ...

సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ...

తెలుగులో ఎన్నో విజయవంతమైన సకుటుంబ కథా చిత్రాల్ని నిర్మించిన సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పేరును నమోదు చేసింది. వారు రీసెంట్ గా మిస్టర్ పెళ్లి కొడుకు చిత్రం తీసారు. అంతకు ముందు కూడా సునీల్ తో అందాల రాముడు వంటి సూపర్ హిట్ చేసారు. తమిళ రీమేక్ లు ఈ బ్యానర్ నుంచి ఎక్కువ వస్తూంటాయి.

'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' తర్వాత...

'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' తర్వాత...

నితిన్‌తో 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి వరుస హిట్లను నిర్మించిన శ్రేష్ఠ్ మూవీస్ బేనర్ 'చందమామ కథలు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అది నమోదుచేసిన టైటిల్‌ను బట్టి అర్థమవుతోంది. హీరో ఖచ్చితంగా నితిన్ ఉంటాడు కానీ, దర్శకుడు ఎవరు అనేది చర్చగా మారింది.

మారుతి నెక్ట్స్ చిత్రం...

మారుతి నెక్ట్స్ చిత్రం...

'ఈ రోజుల్లో', 'రొమాన్స్' వంటి చిత్రాల్ని నిర్మించిన గుడ్ సినిమా గ్రూప్ తాజాగా 'కాయ్ రాజా కాయ్' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించడంతో ఆ సినిమా కూడా మునుపటి సినిమాల తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది. మారుతి తరువాత దర్శకత్వం వహించే చిత్రం అని సుశాంత్ హీరో అని ప్రచారం జరుగుతోంది.

వయస్సుని టార్గెట్ చేస్తూ...

వయస్సుని టార్గెట్ చేస్తూ...

ఇదివరకు 'మేం వయసుకు వచ్చాం' వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన లక్కీ మీడియా ఈ సారి 'ఈ వయసులో ఇంతే' అనే టైటిల్ రిజిస్టర్ చేసింది. హీరో ఎవరనేది తెలియదు. సుధీర్ బాబు అనే ప్రచారం జరుగుతోంది. ఇక ‘టాటాబిర్లా మధ్యలో లైలా', ‘సత్యభామ, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, ‘మేం వయసుకు వచ్చాం'వంటి చిత్రాలు నిర్మించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ... ఇష్క్... కాదల్'. ఈ చిత్రం ద్వారా పవన్ సాదినేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

రకరకాల టైటిల్స్..

రకరకాల టైటిల్స్..

ఒక కుమారుడు ఆది హీరోగా, మరో కుమారుడు సత్యప్రభాస్ డైరెక్టర్‌గా ఆదర్శ చిత్రాలయ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రవిరాజా పినిశెట్టి 'ఒంటరి పోరాటం' పేరుతో టైటిల్‌ను నమోదు చేశారు. అలాగే ఇదివరకు రవితేజ హీరోగా 'భగీరథ'ను నిర్మించిన ఆనందం అకాడమీ 'హరహర మహాదేవ' టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. ఇలా రకరకాల టైటిల్స్ ఫిల్మ్ ఛాంబర్ లో రీసెంట్ గా నమోదు అయ్యాయి.

ఇంతకీ హీరో ఎవరు?

ఇంతకీ హీరో ఎవరు?

పవన్ కళ్యాణ్ నటించిన హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్' చిత్రంలోని సాంగు లిరిక్స్ ఆధారంగా గత సంవత్సరం.....‘కెవ్వు కేక', ‘గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి టైటిల్స్ రిజిస్టర్ అవడంతో పాటు సినిమాలుగా రూపొంది విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంవత్సరం కూడా ఇదే తంతు మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఇందులో బాగా పాపులర్ అయిన ‘ఆరడుగుల బుల్లెట్' సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఆరడుగుల బుల్లెట్' పేరుతో ఫిల్మ్ చాంబర్లో టైటిల్ రిజిస్టర్ అయింది.

English summary
A new film is been registered on the title song of “Attarintiki daredi” ‘Aaradugula Bullet.......’ by BVSN Prasad in AP Film Chamber. Using song titles as film titles is not for first time, we have seen “Kevvu Keka” and “Gunde Jaari Gallanthuayindhe” titles. Here is the question raising in film Nagar that why he registered this title will he is planning another film Power Star or else he want to sell this catchy title to anyone who are getting ready to keep this title for their film. So, we need to wait for few more days to known the real fact behind this “Aaradugula Bullet” title registration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu