»   » అదాశర్మ తల్లి గీసిన పెయింటింగ్ ని ...అనుకరిస్తూ...

అదాశర్మ తల్లి గీసిన పెయింటింగ్ ని ...అనుకరిస్తూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : నితిన్ , పూరి కాంబినేషన్ లో రూపొందిన ‘హార్ట్‌ ఎటాక్‌' చిత్రంతో యూత్ హార్ట్‌ ఎటాక్‌ తెచ్చిన చిన్నది అదాశర్మ. ప్రస్తుతం హీరో ఆది సరసన ‘గరం' సినిమాలో నటిస్తోంది.

ఆదివారం ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఓ ఫొటోని పోస్ట్‌ చేశారు. ఇందులో అమ్మ గీసిన ఓ ఫొటో.. ఆ బొమ్మలా సింగారించిన నేనూ.. అంటూ ఎంతో ముద్దగా అభిమానులతో పంచుకున్నారు. దానిని ఇక్కడ మీరు చూడవచ్చు..

This painting(painted by my mum)called for this pose! I mean comeonn😈now two things made by my mum are in this pic 󾆴󾆴

Posted by Adah Sharma S on Sunday, December 13, 2015

సాయికుమార్‌ తనయుడు ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం గరం. ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సినిమాస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.

ఆది చేస్తున్న ఏడవ సినిమా ‘గరం'. గతంలో ‘పెళ్ళైన కొత్తలో', ‘గుండె ఝల్లుమంది'. ‘ప్రవరాఖ్యుడు' సినిమాల డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆది ఇప్పటికే తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసాడు. మిగతా షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం జోరుగా ఈ మూవీ డబ్బింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఆది ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి నా కెరీర్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ సినిమాలో మేము చూపించే పాయింట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతుంది, అందుకే ఈ మూవీ పక్కాగా అందరికీ నచ్చుతున్న కాన్ఫిడెంట్ తో ఉన్నానని' ఆది అన్నాడు.

Adah sarma post her mother painting

ఆది సరసన ‘హార్ట్ ఎటాక్' ఫేం అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. యం.రాజ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాత. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి, స్క్రీప్లే: మదన్‌, పాటలు: చైతన్యప్రసాద్‌, భాస్కరభట్ల రవికుమార్‌, సంగీతం: అగస్త్య, ఛాయాగ్రహణం: టి. సురేంద్రరెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, కళ: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగిరెడ్డి బి., లైన్‌ ప్రొడ్యూసర్‌: హరికృష్ణ జి.

English summary
Adah Sharma Shared in fB: This painting(painted by my mum)called for this pose! I mean comeonn😈now two things made by my mum are in this pic".
Please Wait while comments are loading...