బెల్లి డాన్స్‌తో మతి పోగొడుతున్న హీరోయిన్.. మందు, సిగరెట్ తాగుతూ అలా మారిపోయింది!
Recommended Video

హీరోయిన్ ఆదా శర్మ పేరు చెప్పగానే హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆదా శర్మ ఎక్కువగా టాలీవుడ్ లో గుర్తింపు లేని పాత్రలకే పరిమితం అయిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించినా ఆ పాత్రలు ఆదా శర్మకు గుర్తింపు నివ్వలేదు. ఇప్పుడు కూడా అరకొరగా అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఆదా శర్మ బాగా యాక్టివ్. ఆదా శర్మ తాజాగా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వైరల్ అవుతున్నాయి.

అందాలు ఆరబోస్తూ
ఆదా శర్మ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. హార్ట్ అటాక్ లాంటి చిత్రంలో ఆదా గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ సరైన విజయం లేకపోవడంతో హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఆదా శర్మ సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటుంది. వివిధ రకాల వీడియోలు చేస్తూ, అందాలు ఆరబోస్తూ యువతలో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ పాత్రలకు తాను సిద్దమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు పంపుతోంది.
బెల్లి డాన్స్‌తో మతి పోగొడుతూ
తాజాగా ఆదా శర్మ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రెండు విడియాలో నెటిజన్లని బాగా ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో ఆదాశర్మ తన బెల్లి డాన్స్ తో మతి పోగొడుతోంది. ఆదా శర్మ డాన్స్ కు, గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈవీడియోలో మరో భయంకరమైన విషయం కూడా ఉంది. డాన్స్ చేస్తూ చేస్తూ ఆదా శర్మ దెయ్యంలా మారిపోతుంది. ఆదా శర్మ క్రియేటివిటీ అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది.
విషయం ఏమిటంటే
ఇంతకీ ఈ వీడియోలో విషయం ఏమిటంటే..మద్యపానం, ధూమపాననానికి వ్యతిరేకంగా ఆదా శర్మ ఈ వీడియోలు చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆదా శర్మ ధూమపానం చేయడం వలన కలిగే నష్టాలని వివరిస్తూ ఓ వీడియో చేసింది. ఆదా శర్మ సిగరెట్ తాగుతూ ఉండగా రక్తం కక్కుతుంది. సిగరెట్ స్మోకింగ్ వలన ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధులు వస్తాయని ఆదా శర్మ ఈ విధంగా తెలిపింది. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. 16 లక్షల వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి.

అభిమానుల కోరిక మేరకు
దూమపానంపై చేసిన వీడియోకు అద్భుతమైన స్పందన రావడంతో.. మద్యపానంపై కూడా వీడియో చేయాలనీ నెటిజన్లు కోరారు. దీనితో ఈ వీడియో చేసింది. ఆదా శర్మ సెక్సీగా బెల్లి డాన్స్ చేస్తూ మధ్య బాటిల్ పట్టుకుని కనిపిస్తుంది.మద్యం తాగుతూ ఉండగా ఆదా శర్మ భయంకరంగా మారి కుప్పకూలిపోతోంది. మద్యానికి బానిసలుగా మారడం వలన జరిగే అనర్థాలు ఇలా ఉంటాయని చెప్పింది.


Click it and Unblock the Notifications











