For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆది న్యూ మూవీ ‘గరం’ (ఫోటోస్)

By Bojja Kumar
|

హైదరాబాద్: లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, 'పెళ్లైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' చిత్రాల ఫేం మదన్ దర్శకత్వంలో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ ఎం. నిర్మిస్తున్న 'గరం' ప్రారంభోత్సవం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఆది సరసన ఆదాశర్మ కథానాయికగా నటిస్తోంది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత కూతురు రాజశ్రీ క్లాప్ కొట్టారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ ఆదా శర్మ హాట్ అండ్ సెక్సీ లుక్‍‌తో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది.

స్లైడ్ షోలో సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలు, ఫోటోలు....

ఆది

ఆది

ఆది మాట్లాడుతూ ''టైటిల్ చాలా హాట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

మదన్ మాట్లాడుతూ ...'నా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ అందించారు. చాలా బాగుంది. నిర్మాతకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఫిలిం మేకింగ్ మీద చాలా క్లారిటీ ఉంది. సమస్యలను అలవోక గా అధిగమించి ముందుకు సాగే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమతో దేన్నయినా సాధించొచ్చన్నది ప్రధాన ఇతివృత్తం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది'' అని తెలిపారు.

నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ

నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ

- ''మా సంస్థలో రూపొందుతోన్న తొలి చిత్రం ఇది. ఆదికి ఇది ఏడవ చిత్రం. కథ చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మదన్ చేసిన సినిమాలన్నీ వినూత్నంగా ఉంటాయి. ఈ చిత్రం ఇంకా వినూత్నంగా ఉండటంతో పాటు కమర్షియల్ గా కూడా ఉంటుంది' అన్నారు.

రెగ్యులర్ షూటింగ్

రెగ్యులర్ షూటింగ్

సెప్టెంబర్ 15నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్‌లో ఓ వారం గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ ఆరంభించనున్నారు. మూడు పాటలను ఫారిన్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బి.నాగిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి., కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.

English summary
Bollywood actress Adah Sharma, who forayed into Telugu film industry with Puri Jagannath-Nithin's hit film Heart Attack, has got another big offer in Tollywood. She will be next seen in movie Garam. She will romance actor Saikumar's son Aadi aka adithya Pudipeddi, who is playing the hero in the movie, which was officially launched on Friday.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more