»   » పర్లేదు పనికొస్తుంది: అదా శర్మ కొత్త ప్రయత్నాలు (వీడియో)

పర్లేదు పనికొస్తుంది: అదా శర్మ కొత్త ప్రయత్నాలు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

"హార్ట్ అటాక్" లో అదాశర్మను చూసి క్యూట్ హీరోయిన్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. అయితే తొలి సినిమా తెచ్చిన పేరును ఈ ముంబయ్ భామ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లోపం ఆమెదో... డైరెక్టర్లదో చెప్పలేం కానీ... మంచి రేంజ్‌కు వెళ్తుందనుకున్న ఈ భామ అంతగా రాణించలేకపోతోంది.

అరంగేట్రం చేసిన రెండేళ్లకే ప్రాధాన్యం లేని రోల్స్ చేసే స్థాయికి పడిపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో అదాను చూసి అభిమానులు చాలా ఫీలైపోయారు. ప్రస్తుతం అదాశర్మ చేతిలో ఒకటో రెండో అవకాశాలున్నాయి. వీటితో నెట్టుకు రావడం కష్టమని... కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్ చేయడానికి సిద్ద పడ్డా పెద్దగా ఉపయోగం లేకపోయింది.

బాలీవుడ్ లో నటించబోయే "కమాండ్ 2" సినిమా కోసం ఈ అమ్మడు వర్కౌట్లు చేస్తుందట. విద్యుత్ జమ్వాల్ లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో అదా శర్మ హీరోయిన్ గా చేస్తోందంటూ వారతలు వచ్చాయి.ఇందులో హీరోతో పాటు హీరోయిన్ కూడా యాక్షన్ సన్నివేశాలు చేయాలంట. అందుకోసమే అదా జిమ్ లో కసరత్తులు చేస్తుందట. అయితే ఈ సినిమా వల్ల కూడా అదా కెరీర్ కి పెద్దగా ఒరిగేదేమీ కనిపించటం లేదు.

ఇక ఖాళీ గా ఉండే బదులు తన హిడెన్ టాలెంట్స్ కి మెరుగుపెట్టుకుందామనుకుందో ఏమోగానీ ఈ మధ్య పాటలు కూడా పాడుతోందిట. ఈ మధ్యే బన్ని కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచిన నిలిచిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని సూపర్ మచ్చీ పాటను సరదాగా పాడి వినిపించింది అదాశర్మ. డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని ఉపయోగిస్తూ అదా పాడిన ఈ పాటకి నెట్ లో స్పందన బాగానే వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్, ఆదాశర్మ పాడిన పాట వీడియోను తన అఫీషియల్ పేజ్ ద్వారా షేర్ చేశాడు.

English summary
Heroine Adah Sharma singing Super Macchi song from S/O Satya Murthy, one of super hit movies of Allu Arjun Directed by Trivikram
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu