»   » యాక్సిడెంట్ పై స్పందించిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మ

యాక్సిడెంట్ పై స్పందించిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హార్ట్ ఎటాక్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన అదా శర్మ నిన్న మంగళవారం యాక్సిడెంట్ కు గురి అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఓ తెలుగు చిత్రం షూటింగ్ కు ఆమె వస్తూంటే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందని, ప్రస్తుతం ఆమె హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. ఈ విషయమై సీరియస్ గా అదా శర్మ స్పందించింది.

అదాశర్మ ట్వీట్ చేస్తూ....తాను క్షేమంగానే ఉన్నానని, రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని అంది. కొద్దిగా జ్వరం మాత్రమే వచ్చిందని అంది. అలాగే... తనను ఏ బస్ గుద్దలేదని చెప్పుకొచ్చింది. ఆమె ఏమందో స్వయంగా ఆమె ట్వీట్ చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్‌ సరసన ‘హార్ట్‌ ఎటాక్‌'లో హీరోయిన్‌గా నటించిన అదా తన అందచందాలు, నటనతో ఆకట్టుకొంది. విక్రమ్‌భట్‌ తీసిన ‘1920'తో వెండితెరపై కాలుపెట్టిన అదా శర్మ, దాని తర్వాత ‘ఫిర్‌', ‘హమ్‌ హై రాహీ కార్‌ కే', ‘హసీ తో ఫసీ' వంటి చిత్రాల్లో నటించింది. కన్నడంలో ‘ధీర రాణా విక్రమ'లోనూ హీరోయిన్ గా చేసింది.

మరో ప్రక్క హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ ‘లైఫ్‌ ఓకే' కోసం బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు విపుల్‌ షా తీయబోతున్న సీరియల్‌లో హీరోయిన్ గా నటించేందుకు ఆమె అంగీకరించింది. ఎంటీవీ వీజేగా పాపులర్‌ అయిన రణ్‌విజయ్‌సింగ్‌ జోడీగా ఈ సీరియల్‌లో కనిపించనుంది అదా. ఓ పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందే ఈ సీరియల్‌లో రణ్‌విజయ్‌ తండ్రిగా సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు రాజ్‌ బబ్బర్‌ నటించనుండటం విశేషం.

Adah Sharma tweet about accident

‘హార్ట్ ఎటాక్' తర్వాత అదా శర్మ తెలుగులో నటించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ ఆమెను పాత్రను సరిగా చూపించలేని, అందం పరంగా కూడా ఆమెను హైలెట్ చేయలేదనే అభిప్రాయం సైతం వ్యక్తం అయింది. హార్ట్ ఎటాక్ తర్వాత మంచి సినిమా పడి ఉంటే అదా శర్మ రేంజి మరింత పెరిగేది. కానీ అలా జరుగలేదు.

మరో తెలుగు మూవీ ‘గరం'లో ఆమె హీరో ఆదికి జోడీగా నటిస్తోంది. అయితే ఈచిత్రం గత కొంతకాలంగా వార్తల్లో లేదు. ఆర్థిక పరమైన సమస్యలతో షూటింగ్ ఆగినట్లు సమాచారం. ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పాపం అదా... అందం, టాలెంట్ ఉన్నా అందలం ఎక్కడంలో ఇబ్బంది పడుతోంది.

English summary
Adah Sharma tweeted: "Everyone I'm alive!quickly before any rumours spread. It's very hot in hyderabad and I have slight fever. Do not panic.nothing has happened. I was shooting on a bike yesterday.I'm totally fine .In one piece.Alive.Tweeting this immediately so that rumours won't spread.no bus hit me"
Please Wait while comments are loading...