»   »  అదా శర్మ తల్లి చేస్తున్న వ్యాయామ విన్యాసాలు చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

అదా శర్మ తల్లి చేస్తున్న వ్యాయామ విన్యాసాలు చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ గుర్తుండే ఉండి ఉంటుంది. చాలా అమాయకంగా కనిపించే అదా.. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అయితే ఆమె కెరీర్‌ మాత్రం అనుకున్నంత ఆశాజనకంగా సాగడం లేదు. అలాగని ఆమెకు హిట్లు లేవని కాదు. సర్లేండి ఇది ఆమె కెరీర్ గురించి కాదు కాబట్టి ప్రక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం.

Adah Sharma tweet about her mother

ఇప్పుడు అదాశర్మ తన తల్లి షీలా వ్యాయామం చేస్తున్న వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. షీలా వ్యాయామం చేస్తన్న తీరు మీడియాలో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె తన కుమార్తె కన్నా చాలా ఫిట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా అదాశర్మ ట్విట్టర్‌లో తన తల్లి వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. 'సోమవారం ఉదయం వ్యాయామ స్ఫూర్తి. మల్లకంబ్‌పై అమ్మ. మా అమ్మ చాలా శక్తిమంతురాలు' అని ట్వీట్‌ చేశారు.

వీడియోలో షీలా ఓ కర్ర సహాయంతో వివిధ భంగిమల్లో వ్యాయామం చేస్తూ కనిపించారు. తమిళనాడులో దీన్ని 'మల్లకంబ్‌' అంటారు. ఇది జిమ్నాస్టిక్స్‌కు దగ్గరగా ఉంటుంది. దీన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతూ కామెంట్స్‌ చేశారు. నమ్మలేకపోతున్నాం, అద్భుతం, మీ అమ్మ చాలా గొప్పవారు, స్ఫూర్తిదాయకం.. అంటూ తెగ కామెంట్స్‌ చేశారు.ఈ వీడియో చూసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అదా శర్మ తల్లిని ప్రశంసిస్తూ.. ట్వీట్‌ చేశారు.

'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'క్షణం' వంటి సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. అయితే అవేవీ ఆమెను స్టార్‌ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. అయినా ఆమె తన ప్రయత్నం మానలేదు. అడపాదడపా ఫోటోషూట్‌లతో హల్‌చల్‌ చేస్తోంది. మరి నిర్మాతల, దర్శకుల కళ్లు ఇప్పుడైనా అదాపై పడతాయో, లేదో చూడాలి.

English summary
Adah Sharma tweeted: "Monday morning workout motivation ...This is my Mamma on the Mallakhambh Pole 💪💪💪 my mamaaaa strongest !"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu