'కొత్త బంగారు లోకం' డైరక్టర్ గురించి

ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నేటివ్ ప్లేస్ పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి. అతని కాలేజీ చదువంతా రేలంగి దగ్గర టౌన్ తణుకులో సాగింది. డిగ్రీ పూర్తయ్యాక కొద్దిరోజులు అక్కడికి దగ్గర్లోని వేలివెన్ను శశి రెసిడెన్షియల్ కాలేజీలో పని చేశాడు. ఇక అక్కడ చూసిన, తారసపడ్డ వ్యక్తులు, అనుభవాల్నే కథ కోసం తీసుకున్నానని చెప్తున్నాడు. అలాగే వంశీ దర్శకత్వంలో వచ్చిన 'లేడీస్ టైలర్' లాంటి చిత్రాలూ అతనికెంతో ఇష్టమంటున్నాడు.
ఆయన చిత్రాల్లో పేర్లు, మాట తీరు అంతా సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అవే తన సినిమాలో ఇన్ కార్పోరేట్ చేయటానికి ప్రయత్నించాను అంటాడు.అలాగే అతనికి ఎమ్.టెక్. పూర్తయ్యాక... ఐఐటీలో ఫెలోషిప్ వచ్చినా సినీ ఫీల్డ్ పై మమకారంతో ఇక్కడికొచ్చాడు. మొదట వినాయక్ దగ్గర 'ఠాగూర్'కి సహాయకుడిగా చేరాడు. ఆ తరవాత 'ఆర్య', 'బొమ్మరిల్లు'కి పనిచేశి దిల్ రాజు ఇచ్చిన అవకాశంతో నేడు దర్శకుడినయ్యాడు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ...


Click it and Unblock the Notifications











