»   » నేషనల్ అవార్డు లభించడం చాలా ప్రమాదకరం..

నేషనల్ అవార్డు లభించడం చాలా ప్రమాదకరం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేషనల్ అవార్డును గెలుచుకోవడంపై నటుడు ఆదిల్ హుస్సేన్ ఒకింత ఆందోళన, మరో వైపు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవార్బును అందుకోవడం వల్ల బాధ్యత పెరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముక్తి భవన్, మజ్ రాతి కెటెకీ చిత్రాల్లో అద్భుత నటనా ప్రతిభకు గానూ ఆదిల్ హుస్సేన్ ప్రత్యేక నేషనల్ అవార్డు లభించింది. జాతీయ చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపించిన కళాకారులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నేషనల్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అవార్డులు రావడం వల్ల బాధ్యత..

అవార్డులు రావడం వల్ల బాధ్యత..

ఈ సందర్భంగా ఆదిల్ హుస్సేన్ మాట్లాడుతూ అవార్డులు అందుకోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి అవార్డులు రావడం మరీ ప్రమాదకరం. దీంతో భవిష్యత్‌లో మరింత ప్రతిభను చూపించాల్సిన భారం పెరుగుతుంది. అవార్డు లభించిన నేపథ్యంలో ఇంకా మరింత శ్రమిస్తాను. ప్రేక్షకులు మెచ్చె చిత్రాల్లో నటిస్తాను అని అన్నారు.

సరైన దిశలోనే..

సరైన దిశలోనే..

53 ఏండ్ల వయస్సులో అవార్డు లభించడం వల్ల మంచి స్ఫూర్తి కలుగుతుంది. సరైన దిశలో ప్రయాణిస్తున్నామనే భావన కలుగుతుంది. ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఆదిల్ హుస్సేన్ తెలిపారు.

 జాతీయ స్థాయిలో గుర్తింపు

జాతీయ స్థాయిలో గుర్తింపు

ముక్తి భవన్, మజ్ రాతి కెటెకి చిత్రాలకు అవార్డుల రావడంపై ఆదిల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాటలు రావడం లేదని ఆయన అన్నారు. ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు రావడంపై ఆనందంలో మునిగి తేలుతున్నానని ఆదిల్ మీడియాతో అన్నారు.

25 ఏళ్లకే అవార్డు

25 ఏళ్లకే అవార్డు

ముక్తి భవన్ చిత్ర దర్శకుడు శుభాశీష్ భుటియానిపై ఆదిల్ హుస్సేన్ ప్రశంసల వర్షం కురిపించారు. శుభాశీష్ తన 23 ఏటా కథ రాశారు. 24 ఏటా డైరెక్షన్ చేశాడు. 25 ఏట అవార్డు లభించింది అని ఆయన పేర్కొన్నారు.

English summary
Actor Adil Hussain, who has received special mention at the National Awards for his work in the films Mukti Bhawan (Hotel Salvation) and Maj Rati Keteki , fell short of words while expressing his happiness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu