»   » జియా ఖాన్ తల్లిపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

జియా ఖాన్ తల్లిపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Aditya Pancholi files Rs 100 cr defamation suit against Jiah Khan's mother
ముంబై: గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటి నటి జియాఖాన్ కేసు ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన కూతురు మరణం వెనక బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలి ప్రమేయం ఉందని ముందు ఆరోపిస్తున్న జియా తల్లి రబియా ఖాన్.....వారిపై తరచూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో నటుడు ఆదిత్య పంచోలి రబియా ఖాన్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసారు. ట్విట్టర్‌లో తమపై రబియా అమర్యాదపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమె చర్యల కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో, సమాజంలో పరువు పోతోందని పిటీషన్లో పేర్కొన్నారు.

జియా ఖాన్ కేసు విషయానికొస్తే...

జియాఖాన్(25) మృతి కేసును బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయూర్తులు విఎం కనడే, పిడి కోడేలు జియాఖాన్ మృతి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సిబిఐని ఆదేశించారు.

జియాఖాన్ మృతి కేసు విచారణను సిబిఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియాఖాన్ 2013, జూన్ 3న ముంబైలోని జుహూలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించారు.

జియాఖాన్ నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సూసైడ్ నోట్ జియా రాసింది కాదని ఆమె తల్లి రబియా ఆరోపించారు. జియాఖాన్‌ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐచే విచారణ కొనసాగించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సిబిఐకి ఈ కేసును బదిలీ చేసింది.

English summary
Bollywood actor Aditya Pancholi has reportedly filed a defamation suit of Rs 100 crore against Rabiya Khan, the mother of late actress Jiah Khan. According to reports in a leading daily, the Bombay high court has received the suit worth a whopping Rs 100 crore filed by the Pancholis on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu