»   » డిఫెరెంట్: నారా రోహిత్ 'అసుర' కు విలన్ వాయిస్ ఓవర్

డిఫెరెంట్: నారా రోహిత్ 'అసుర' కు విలన్ వాయిస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ నెల 5న 'అసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నారా రోహిత్ . ఈ చిత్రానికి ఓ విలన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆ విలన్ ఎవరూ అంటే మరెవరో కాదు...అడవి శేషు. రీసెంట్ గా దొంగాట చిత్రంలో నటించిన అడవి శేషు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సమాచారం. అడవి శేషు గతంలో పవన్ కళ్యాణ్ ..పంజా చిత్రంలో చేసారు. త్వరలో ...బాహుబలి చిత్రంలో రానా కు కొడుకు గా కనిపించనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Adivi Sesh voice over for Asura


'అసుర' విషయానికి వస్తే...


నారా రోహిత్ మాట్లాడుతూ... ''రౌడీఫెలో' తర్వాత మరోసారి పోలీసు పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. 'అసుర'లో నేను జైలర్‌ ధర్మగా కనిపిస్తా. 'రౌడీఫెలో'లో పోషించిన పోలీసు పాత్రకు, ఇందులో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సంభాషణలు పలికే విధానం, నటన అన్నీ కొత్తగానే ఉంటాయి. 'అసుర' అనే పేరు పెట్టడానికి కథే కారణం. ఇందులో నా పాత్ర తీరు ఓ పనిరాక్షసుడిని తలపిస్తుంటుంది.'పురాణాల్లో రాక్షసులని చంపితే దేవుళ్లు అన్నారు. అదే పని నేను చేస్తే రాక్షసుడు అంటున్నారు' అనే డైలాగ్‌ ఈ సినిమాలో ఉంది. అందుకే సినిమాకి ఉపశీర్షికగా కూడా 'గుడ్‌ ఈజ్‌ బ్యాడ్‌' అని పెట్టాం. ఈ రెండు విషయాల్ని బట్టి కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణవిజయ్‌ చిత్రాన్నిబాగా తీర్చిదిద్దాడు'' అన్నారు. రోహిత్‌ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు.


అలాగే...''పక్కా వాణిజ్య చిత్రాలు చేయడం లేదని నాపై ఫిర్యాదులొస్తుంటాయి. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నవాళ్లందరినీ వందశాతం సంతృప్తిపరిచే సినిమా 'అసుర'. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రమిది. పాటలు, ఫైట్లు, డైలాగులు... ఇలా మాస్‌ని మెప్పించే అంశాలన్నీ ఉన్నాయి. నా సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండవు. కానీ ఇందులో ఆ పాట కుదిరింది. అందుకే ఈ చిత్ర విజయంపై నాకు నమ్మకముంది'' అని చెప్పుకొచ్చారు.

English summary
Adivi Sesh will be giving a small voice over inAsura.film. After ‘Rowdy Fellow' the budding hero with baritone voice Nara Rohith is seen as cop once again in the film Asura. Asura is all set to release this Friday and the post production works are going on in full swing.
Please Wait while comments are loading...