»   » ‘అత్తారింటికి దారేది’ కి మరో అదిరిపోయే రికార్డ్

‘అత్తారింటికి దారేది’ కి మరో అదిరిపోయే రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' మరో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకి సంబందించిన వీడియోని ఒక్క మా టీవీ యుట్యూబ్ లోనే 25లక్షల మంది చూడటం జరిగింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమాని ఇంతమంది చూడటం జరగలేదు.


మరో వైపు సినిమా విడుదలకు ముందే భారీ ఎత్తున రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల రైట్స్ ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయాయి. సినిమా విడుదలకు ముందు నిర్మాతకు పెట్టుబడి తిరిగి రావడమే కాదు, భారీ ఎత్తున లాభాలు వచ్చాయని సమాచారం. ఇక సినిమా విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు అతడు, జులాయి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభేంటో రూచి చూపించారు. ఆయన సినిమాలు ఎంటర్టెన్మెంట్ పెట్టింది పేరు అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ విషయంలో కానీ, సీన్లు విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యే రకంకాదు. తను అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఆయన పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకించి రాసే పంచ్ డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షనను తెస్తాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్. పవన్ కళ్యాణ్‌తో నటించడం తన అదృష్టమని ఇటీవల సమంత ఆడియో వేడుకలో వ్యాఖ్యానించింది.


పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Attarintiki Daaredi starring Pawan Kalyan is one of the much talked about film this season. The movie's theatrical trailer is getting more than 25 lakhs views on youtube on a single channel. This is unusual for a Telugu film. Such is the interest and wait for Pawan Kalyan's film. Directed by Trivikram, the film is said to be an uproarious family drama. BVSN Prasad the producer of the film is planning to release the film on 21st August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu