»   » డబ్బుకోసం బూతు మార్గంలో దర్శక నిర్మాతలు (ఫోటో ఫీచర్)

డబ్బుకోసం బూతు మార్గంలో దర్శక నిర్మాతలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమ అంటేనే కళాకారులకు నిలయం అనేది అంతా చెప్పుకునే మాట. కళాకారులు తమ పెర్ఫార్మెన్స్‌తో పండించే నవరసాలు ఉంటేనే సినిమాకు పరిపూర్ణత వస్తుందనేది వాస్తవం. అయితే రాను రాను సినీ పరిశ్రమలో వ్యాపార పోకడ శృతి మించిపోతోంది....బూతు రాజ్యమేలుతోంది.

కొందరు దర్శక నిర్మాతలు డబ్బు కోసం నైతిక విలువలు మరిచి బూతు కంటెంటుతో నిండిన సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనే కొందరు నిర్మాతల ఆశ సినీ పరిశ్రమలో విచ్చలవిడి తనానికి దారి తీస్తోందని సినీ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలో పాపులారిటీ, డబ్బు సంపాదించడం కోసం కొందరు నటీనటులు కూడా ఇలాంటి సినిమాల్లో చేయడానికి ముందుకు వస్తున్నారు.

బాలీవుడ్ పరిశ్రమలో అడల్ట్ కంటెంటుతో కూడిన సినిమాల జోరు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. పెద్దలకు మాత్రమే పరిమితమైన బూతు కంటెంట్, హింసాత్మక సన్నివేశాలతో సినిమాలను నింపేస్తున్నారు.

హమ్ షకల్స్

హమ్ షకల్స్

ఇటీవల బాలీవుడ్లో విడుదలైన ‘హమ్ షకల్స్' చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో బూతులు, చడాలం, డబుల్ మీనింగ్ డైలాగులు తప్ప ఏమీ లేవని పలువురు క్రిటిక్స్ తేల్చేసారు.

హేట్ స్టోరీ 2

హేట్ స్టోరీ 2

నిన్న మొన్నటి వరకు ‘హేట్ స్టోరీ 2' గురించి ఎవరికీ తెలియదు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో అందరి చూపు ఒక్కసారిగా ఆ సినిమా వైపు మళ్లింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఓ పాటలోనో, ఓ సన్నివేశంలో శృంగార సీన్లు ఉంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం ఒకటి రెండు సన్నివేశాలు మినహా అంతా బూతు కంటెంటుతో నింపేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

నషా..

నషా..

ఆ మధ్య పూనమ్ పాండే నటించిన నషా చిత్రం బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకన్న సంగతి తెలిసిందే. పూనమ్ పాండే అందచందాలు, బూతుకంటెంట్ ప్రధాన పెట్టుబడిగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2

జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2

ఆ మధ్య సన్నీ లియోన్ నటించిన జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రాల్లో మొత్తం బూతు కంటెంటే నిండి ఉండటం గమనార్హం. ఇవి మాత్రమే కాదు....ఇలాంటి సినిమాల జోరు ఈ మధ్య బాగా పెరిగి పోయింది.

English summary
It may come as a surprise, but Bollywood, which supposedly churns out "wholesome entertainment'' for the jumbo Indian family, released the largest number of Adults Only movies last year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu