»   » హీరో ఉపేంద్ర భార్య థ్రిల్లర్ :13 సంవత్సరాల తర్వాత మళ్ళీ

హీరో ఉపేంద్ర భార్య థ్రిల్లర్ :13 సంవత్సరాల తర్వాత మళ్ళీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉపేంద్ర టాలీవుడ్ లో మరీ పేరుచెప్పి పరిచయం చేసే అవసరం లేని నటుడు (H2O) అనే సినిమాలో నటించిన ప్రియాంక ఉపేంద్రను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చెక్‌ పెట్టేసింది. ఆ తరువాత ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కుడా అయ్యింది. చాలా రోజుల తరువాత ప్రియాంక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

ప్రియాంక ఓ థ్రిల్లర్

ప్రియాంక ఓ థ్రిల్లర్

ప్రస్తుతం కన్నడలో ప్రియాంక అనే పేరుతో ఓ థ్రిల్లర్ సినిమా రూపొందనుంది ఆ సినిమాలో లీడ్ రోల్ లో ఈ భామ నటిస్తుందట. ఇదికాక తమిళ్ లో కూడా మరో కోల్కతా నేపథ్యం లో సాగే హౌరా బ్రిడ్జ్ అనే సినిమా చేస్తోంది ప్రియాంకా ! నా భర్త ఉపేంద్ర కూడా సినిమాల్లో నటించేందుకు సపోర్ట్ ఇస్తున్నాడు అంటూ చెప్పింది. మరి ప్రియాంక సినిమాలో ప్రియాంక నటించే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

చిన్నారి

చిన్నారి

ప్రియాంక గతసంవత్సరం కూడా చిన్నారి అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఉపేంద్ర భార్య ప్రియాంక‌. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిన ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హ‌ర‌ర్ నేప‌థ్యంలో చైల్డ్ సెంటిమెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కింది.

జ‌న‌నం

జ‌న‌నం

ఇక ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైది ప్రియాంక‌. 2004లో ప్రియాంక న‌టించిన జ‌న‌నం అనే చిత్రం విడుద‌ల కాగా, 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్రియాంక మ‌ళ్ళీ త‌మిళ చిత్రంలో న‌టించ‌నుంది. హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ మూవీ కోల్‌క‌తాలో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా తెర‌కెక్క‌నుంది.

లోహిత్ ద‌ర్శ‌క‌త్వం

లోహిత్ ద‌ర్శ‌క‌త్వం

థ్రిల్ల‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త‌మిళ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇక ఇదిలా ఉంటే ఉపేంద్ర‌- ప్రియాంక‌ల కూతురు ఐశ్వ‌ర్య కూడా త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

English summary
Priyanka will be portraying the role of a doting mother in this movie, while Aishwarya will essay the role of her daughter. Directed by Lohit, Howrah Bridge is a thriller based on true incidents that happened in Kolkatta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu