»   » అప్పుడు... ఇపుడు: 16 ఏళ్ల తర్వాత మహేష్-ఎన్టీఆర్ ఇలా, ఫోటో వైరల్

అప్పుడు... ఇపుడు: 16 ఏళ్ల తర్వాత మహేష్-ఎన్టీఆర్ ఇలా, ఫోటో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
After 16 years Mahesh-NTR In One Frame

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షనకు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. 'భరత్ భహిరంగ సభ' పరుతో శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఎగ్జైట్మెంటుకు గురయ్యారు.

‘ఆది’ ఆడియో ఆవిష్కరణలో

‘ఆది’ ఆడియో ఆవిష్కరణలో

16 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆది' సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా వెళ్లారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు మూవీ ప్రి రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇద్దరి కలయికకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది.

మహేష్ నా అన్న

మహేష్ నా అన్న

భరత్ బహిరంగ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.... నేను ఈ వేడుకకు ముఖ్య అతిధిని అంటున్నారు. నేను ముఖ్య అతిధిగా రాలేదు. మహేష్ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మీరంతా ఆయన్ని ప్రిన్స్, సూపర్ స్టార్ అని అంటారు. కానీ నేను మాత్రం ఆయన్ని మహేష్ అన్న అని అంటాను అన్నారు.

ఎన్టీఆర్ పెళ్లి సమయంలో

ఎన్టీఆర్ పెళ్లి సమయంలో

ఇక మహేష్ బాబు తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను తమ్ముడూ అంటూ సంబోధించారు. తమ్ముడు ఎన్టీఆర్ నుంచి మాటలు నేర్చుకొన్నాను. ఆడియో ఫంక్షన్‌కు వచ్చినట్టు లేదు. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వచ్చినట్టు ఉంది... అని సంతోషం వ్యక్తం చేశారు.

ఇద్దరి కాంబినేషన్లో మూవీ?

ఇద్దరి కాంబినేషన్లో మూవీ?

మహేష్ బాబుని, ఎన్టీఆర్ ని ఓ ప్రేములో చూస్తుంటే తనకు ఓ ఐడియా వస్తోందని బ్రహ్మాజీ అన్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు లని పెట్టి దేవుచేసిన మనుషులు చిత్రం తీయాలని ఉందని బ్రహ్మాజీ అన్నారు. పోకిరి, యమదొంగ కలిస్తే తాను ప్రొడ్యూసర్ గా మారుతానని బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ మాదిరిగానే చాలా మంది దర్శక నిర్మాతల్లో వీరిద్దరిని పెట్టి మల్టీ స్టారర్ మూవీ చేయాలనే ఆలోచనకు బీజం పడింది. మరి భవిష్యత్తులో ఇది నిజం అయ్యే అవకాశాలూ లేక పోలేదు.

English summary
After 16 years Mahesh-NTR in one frame. 16 years back Mahesh Babu attended as Chief Guest for NTR's ‘Aadhi’ audio release event . After long time NTR graced an event relating to Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X