»   » మహేష్ ‘దూకుడు’ పూర్తవగానే బిజినెస్ మొదలెడుతాడట...

మహేష్ ‘దూకుడు’ పూర్తవగానే బిజినెస్ మొదలెడుతాడట...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన బ్లాక్ బ్లస్టర్ 'పోకిరి'. ఆ సినిమా తరవాత వారిద్దరు వారి వారి సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు. పోకిరి సినిమా విడుదలైన ఐదు సంవత్సరాల తరవాత ఇప్పుడు పూరి, మహేష్ కాంబినేషన్లో 'ది బిజినెస్ మాన్' అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా జూలై నెలలో సెట్స్ ఫై కి వెళ్ళనుంది.

మే నెలలోనే మొదలవ్వవలసిన ఈ సినిమా సినీకార్మికుల సమ్మె తదితర కారణాల వల్ల జూలై నెలకు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ ఫై వెంకట్ నిర్మిస్తున్నారు. మహేష్ సరసన శృతి హసన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

ప్రస్తుతం మహేష్ 'దూకుడు' పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అలాగే పూరి జగన్నాథ్ కూడా అమితాబ్ తో 'బుడ్డా' రూపొందించే పనిలో తలమునకలై ఉన్నాడు. జూన్ నెలాఖరుకు దూకుడు, బుడ్డా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి ఆ తరవాత బిజినెస్ మాన్ మొదలవుతుందని తెలుస్తుంది.

English summary
One of the most acclaimed combination in Telugu cinema is Puri Jagannath and super star mahesh babu, every one know the magic of there combination with pokiri it rewrote the records of 75 yrs in Telugu cinema and yet again this combination has come together for the movie the business man and news is that the movie is going on the sets from the month of July.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu