»   » పవన్ కల్యాణ్ మరో రీమేక్‌కు సిద్ధం.. ఈసారి ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా

పవన్ కల్యాణ్ మరో రీమేక్‌కు సిద్ధం.. ఈసారి ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తునే వరుస సినిమాలు చేయడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు. ఇప్పటికే 'థలా' అజిత్ కుమార్ నటించిన వీరం చిత్రాన్ని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అజిత్ తదుపరి చిత్రం 'వివేకం'ను రీమేక్‌గా మలిచేందుకు సన్నద్ధమవుతున్నట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పరిశీలనలో వివేకం

పరిశీలనలో వివేకం

ఇదిలా ఉండగా, నెల్సన్ దర్శకత్వంలో అజిత్ నటించిన వేదాలం చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలించాడట. అయితే దానిపై సరైన నిర్ణయానికి రాలేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కకుపెట్టినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత అజిత్ నటిస్తున్న సెన్సెషనల్ ప్రాజెక్ట్ వివేకంపై దృష్టిపెట్టినట్టు సమాచారం.

ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా

ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా

వివేకం చిత్రంలో అజిత్ కుమార్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. చెన్నైలో జరిగిన నేరానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా తెరపైన కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్‌తో సిద్ధమవ్వడం గమనార్హం. ఇటీవల విడుదలైన వివేకం ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సిక్స్ ప్యాక్‌కు అవకాశం ఉందా

సిక్స్ ప్యాక్‌కు అవకాశం ఉందా

ఒకవేళ వివేకం చిత్రాన్ని రీమేక్ చేస్తే అజిత్ మాదిరిగా పవన్ కల్యాన్ సిక్స్ ప్యాక్ చేసే అవకాశం కష్టమే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పవర్ స్టార్ పై ఉంది. ఈ నేపథ్యంలో సిక్స్ ప్యాక్ కోసం సమయం వెచ్చించే అవకాశం ఉంటుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది.

అజిత్ సిక్స్ ప్యాక్‌పై సినీ హీరోల ఫిదా

అజిత్ సిక్స్ ప్యాక్‌పై సినీ హీరోల ఫిదా

వివేకం ఫస్ట్‌లుక్‌పై అటు టాలీవుడ్ హీరోలు, ఇటు బాలీవుడ్ హీరోలు ఫిదా అయ్యారు. నయనతార, సల్మాన్, రానా దగ్గుబాటి లాంటి హీరోలు ట్విట్టర్‌లో ప్రశంసించారు. కాజల్ అగర్వాల్, అక్షరహాసన్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న వివేకం చిత్రం ఆగస్టు 10న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

భారీ అంచనాలతో కాటమరాయుడు

భారీ అంచనాలతో కాటమరాయుడు

టీజర్‌తో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్న కాటమరాయుడు భారీ అంచనాలతో మార్చి 24న రిలీజ్ కానున్నది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గబ్బర్‌సింగ్ జోడి శృతిహాసన్ జతకట్టింది. అలీ, అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు తదితరులు నటించారు.

English summary
There is rumour that powerstar Pawan Kalyan will be remaking Thala Ajith Kumar's forthcoming spy thriller Vivegam. Now, grapevine is abuzz with the news that Pawan Kalyan is all set to remake Thala Ajith Kumar's Vivegam, which is tipped to be a spy thriller. In Vivegam, Ajith Kumar is touted to play a suave Interpol officer, who is in charge of crime scene in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu