సూర్యతో ‘గురు’ దర్శకురాలి సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..
తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన గురు (హిందీలో మాధవన్‌తో సాలా ఖడూస్) చిత్రంతో విశేష ప్రజాదరణను సొంతం చేసుకొన్న మహిళా దర్శకురాలు సుధ కొంగర మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు.
తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన గురు (హిందీలో మాధవన్‌తో సాలా ఖడూస్) చిత్రంతో విశేష ప్రజాదరణను సొంతం చేసుకొన్న మహిళా దర్శకురాలు సుధ కొంగర మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. తన తదుపరి చిత్రాన్ని విలక్షణ నటుడు సూర్యతో రూపొందించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కిక్ బాక్సింగ్ నేపథ్యంగా వచ్చిన గురు చిత్రం హిందీ, తెలుగులో భాషల్లో సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గత కొద్దినెలల క్రితం హీరో సూర్యకు సుధ చెప్పిన కథ నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్య దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందిస్తున్న చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం హిందీలో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ చబ్బీస్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











