Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇది బయోపిక్ కాదు, శ్రీదేవి తర్వాత నేనే, మనదేశం లోనే అలా చూస్తారు: కంగన
వైవిధ్యమైన పాత్ర లతో విభిన్నం గా కనిపించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నసినిమా 'సిమ్రాన్ '.ఈ సినిమా లోని కంగనా గెటప్ చిత్రాన్ని తాజాగా ఆ సినిమా దర్శకుడు హన్సల్ మెహతా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు .ఈ ఫోటో నెటిజెన్లను అలరిస్తుంది .ఈ సినిమా చిత్రీకరణ అమెరికా లో జరుగుతుంది .

ఎన్నారై ప్రఫుల్ పటేల్ పాత్రలో
ఈ సినిమాలో కంగనా విడాకులు పొందిన గుజరాతీ ఎన్నారై ప్రఫుల్ పటేల్ పాత్రలో నటిస్తుంది .తానూ చేసిన అప్పుల కోసం బందిపోటుగా మారిన ఒక యువతి కథగా రానుంది .నేరస్తురాలిగా మారి జైలు కు వెళ్లిన అమెరికా నర్స్ సందీప్ కౌర్ జీవిత కథ ఆధారం గా ఈ సినిమా తెరకెక్కనుంది అని ఒక టాక్ ఉన్నా తను చేస్తున్న సిమ్రాన్ ఒక కామెడీ మూవీ అని ఇది ఎవరి జీవిత కథ కాదని చెప్పింది.

శ్రీదేవి గారి తరువాత నేనే
కామెడీ సినిమాల్లో హిరోయిన్లు ఎవరూ పెద్దగా రాణించలేదు పై గా ఇప్పుడు ఎవరు చేయటంలేదు కూడా అంటూ కామెంట్ చేసింది. ''శ్రీదేవి తరువాత మళ్ళీ మా తరం లో నేనే కామెడీ చేశాను. తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో దత్తో మను కావచ్చు.. ఇప్పుడీ సిమ్రాన్ కావొచ్చు.. శ్రీదేవి గారి తరువాత నేనే.

కామెడీ చేసే హీరోరోయిన్లను
అయినా మన దేశంలో ఆడవాళ్ళని.. అందులోనూ కామెడీ చేసే హీరోరోయిన్లను బాగా తక్కువగా చూస్తారెందుకో అర్ధం కాదు'' అని చెప్పింది. డైరెక్టర్ రాజు కుమార్ హిరణి ఒకసారి స్టాండ్ అప్ కమేడియన్ పై ఒక చిత్రం నిర్మించాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. బహుశా కంగనా గాని అందులో నటించడం లేదు కదా.

హౌస్ కీపింగ్ చేసే మహిళగా
ఈ సినిమా కోసం ముందుగా రెండు గెటప్స్‌ని అనుకున్నారు. ఓ గెటప్‌లో హౌస్ కీపింగ్ చేసే మహిళగా కంగనా కన్పించనుంది. దీనికోసం కంగనా పెద్దగా కసరత్తులు చేయాల్సిన అవసరం రాలేదట. ఇంకో పాత్ర కోసం మాత్రం కంగన చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిందట. లేడీ డాన్ లుక్ కోసం కంగన నానా తంటాలూ పడిందట. కంగనా గతంలోనూ ఈ తరహా గెటప్‌లో కన్పించినా, 'సిమ్రాన్'లో ఆమె డాన్ గెటప్ ఇంకా డిఫరెంట్‌గా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

నాలుగైదు గెటప్స్ వుంటాయట
ఈ రెండు గెటప్స్‌కి తోడు, ఇంకో నాలుగైదు గెటప్స్ వుంటాయనీ, అయితే అవన్నీ సినిమాల్లో కాస్సేపు మాత్రమే కన్పిస్తాయనీ తెలుస్తోంది. కంగనా అంటే ఒకప్పుడు అందాల విందుకే పరిమితమైన హీరోయిన్. కానీ కంగనా అంటే ఇఫ్పుడు బాలీవుడ్‌లో మంచి నటి. పలు అవార్డులు ఇటీవలి కాలంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

హంసల్ మెహతా
ఇకపోతే హంసల్ మెహతా డైరెక్ట్ చేస్తున్న సిమ్రాన్ సినిమా రచనలో కూడా నాకు గుర్తింపు ఇవ్వమని గొడవపెట్టిందట కంగనా. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా నెగిటివ్ పాత్ర పోషిస్తోందని, ఊహించని పరిస్థితుల్లో ఒక మహిళ నేర ప్రపంచంలోకి ఎలా చేరిందనే కథాంశంతో ‘సిమ్రాన్'ని రూపొందిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.