twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత: థియేటర్స్ ఓపెన్ విషయంలో గందరగోళం.. ఇలా అయితే కష్టమే..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరోసారి సందిగ్ధంలో పడింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అయితే ఎత్తి చేశారు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇంకా పూర్తిగా అమలు కాలేదు. నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ఇక థియేటర్స్ పూర్తిగా తెరచుకుంటాయా లేదా అనే విషయంపై కూడా ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతల మండలి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది.

    లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత

    లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత

    సెకండ్ వేవ్ లో తీవ్రంగా మరణాల సంఖ్య పెరగడంతో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కొంచెంకొంచెంగా తగ్గిన అనంతరం పరిస్థితులు అర్థం చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లో సడలింపులు చేసుకుంటూ వచ్చారు. ఇక మొత్తంగా నేటితో పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తి వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది.

    ఆంద్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ

    ఆంద్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ


    అంతా బాగానే ఉన్నప్పటికీ థియేటర్స్ త్వరలోనే ఓపెన్ కాకపోవచ్చు అనే టాక్ వస్తోంధి. ఎందుకంటే తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ ఆంద్రప్రదేశ్ లో ఇంకా నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ఒక రాష్ట్రంలో సినిమాలు రిలీజ్ చేసి మరొక రాష్ట్రంలో రిలీజ్ చేయకపోతే అది మంచి నిర్ణయం కాకపోవచ్చు. రాష్ట్రాలు వేరైనా కూడా తెలుగు సినిమా ఒక్కటే అనేలా సెంటిమెంట్ అయితే నడుస్తోంది.

     50% ఆక్యుపెన్సీతో అంటే.. రిస్క్ చేయడమే

    50% ఆక్యుపెన్సీతో అంటే.. రిస్క్ చేయడమే

    ఒకవేళ అనుమతులు ఇచ్చినా కూడా 50% ఆక్యుపెన్సీతో కొనసాగించడం అనేది సాధ్యం కాని పని. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో మూడు షోలతో కేవలం సగం ఆక్యుపెన్సీ నడుమ థియేటర్స్ ను కొనసాగించడం అంటే సినిమా నిర్మాతల భవిష్యత్‌తో ఆడుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.. జనాలు కూడా ఇప్పట్లో అంత ఈజీగా థియేటర్స్ వెళ్లే అవకాశం కూడా కనిపించడం లేదు. ఏదేమైనా ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ కూడా ఎత్తి వేస్తేనే ఎదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

     మొదట చిన్న బడ్జెట్ సినిమాలు

    మొదట చిన్న బడ్జెట్ సినిమాలు

    ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి సభ్యులు కూడా థియేటర్స్ ఓపెన్ చేయడంపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. చర్చల అనంతరం ముందుగా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను మాత్రమే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కమిటీ సభ్యులు ప్రసన్న కుమార్ తెలియజేశారు. ఇక పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రావచ్చని తెలుస్తోంది.

    Recommended Video

    #Telangana : Devishree Guruji Distributing Grocery For Poor People During Lockdown
    లాక్‌డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు

    లాక్‌డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు

    మరో ఆరువారాల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే వార్తల మధ్య లాక్‌డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మూడో వేవ్‌లో చిన్న పిల్లలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే విషయాన్ని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    English summary
    The situation in the Tollywood industry is once again in limbo. All in all, the lock-down in the state of Telangana has been pointed out but it has not yet been fully implemented in Andhra Pradesh. Night curfew continues. It is not yet clear whether the theaters will be fully open. The filmmakers' council also took a decision in this regard,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X