twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌కు ఆ విషయం తెలియదా?: చాలామంది ఆశ్చర్యపోయారు..

    |

    Recommended Video

    త్రివిక్రమ్ నాకు సలహాలివ్వడు !

    అభిమాన హీరో గురించి చెప్పమంటే.. ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది?.. ఎవరెవరి రికార్డులు బద్దలు కొట్టింది? వంటి విషయాలను కొంతమంది ఫ్యాన్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేయగలరు.

    అభిమానుల సంగతేమో కానీ.. పవన్ కల్యాణ్ వంటి హీరోలకు మాత్రం రికార్డులు, కలెక్షన్ల గోల పెద్దగా పట్టినట్టు కనిపించదు. తాజాగా అజ్ఞాతవాసి ఆడియో విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిచ్చాయి.

     పవన్ ఏమన్నారు:

    పవన్ ఏమన్నారు:

    అజ్ఞాతవాసి ఆడియో విడుదల సందర్భంగా.. జల్సా సినిమా గురించి ప్రస్తావించారు పవన్. అప్పట్లో ఈ సినిమా హిట్టయిన విషయమే తనకు తెలియదని, మూడు సంవత్సరాల తర్వాత కానీ సినిమా విజయం సాధించిందన్న సంగతి తనకు తెలియలేదని పవన్ అన్నారు.

     చాలామందికి ఆశ్చర్యం?:

    చాలామందికి ఆశ్చర్యం?:

    జల్సా సినిమా హిట్టు అన్న సంగతి మూడేళ్ల దాకా తనకు తెలియలేదని పవన్ చెప్పడంతో.. చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. నిజంగా మూడేళ్ల దాకా సినిమా హిట్/ప్లాఫ్ గురించి హీరోకు తెలిసే అవకాశం లేదా? అన్న ఆలోచనతో కొంతమంది బుర్రలు కూడా బద్దలు కొట్టుకుంటున్నారు.

    టీడీపీకి గండికొట్టగలను.. చేతకాని వాజెమ్మ అనుకున్నారా?, గుండుపై మళ్లీ, రేవంత్ ప్రస్తావన: పవన్

     లోపలంతా బాధ:

    లోపలంతా బాధ:

    ఇటీవల జనసేన వేదికలపై కూడా జల్సా సినిమా గురించి ప్రస్తావించారు పవన్. అందులోని డైలాగ్స్ చెబుతూ అభిమానులను హుషారెత్తించే ప్రయత్నం చేశారు.

    తాజాగా అజ్ఞాతవాసి ఆడియో విడుదల వేదికపై కూడా పవన్ ఆ సినిమాను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో తన లోపలంతా ఒకరకమైన బాధ గూడు కట్టుకుపోయిందన్నారు. కెమెరా ముందు నవ్వుతూ నటించినా.. లోపల తన బాధ వేరేగా ఉండేదన్నారు.

    అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనంఅమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

     బలమైన స్నేహం వెనుక:

    బలమైన స్నేహం వెనుక:

    నిజానికి తాను చాలా రోజులు ఇంటికే పరిమితమైన దశలో.. త్రివిక్రమ్ వచ్చి తనను బయటకు తీసుకొచ్చినట్లు పవన్ తెలిపారు. మీ లాంటి వాళ్లు బయటకు రావాలి.. అని ఆయన ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు.

    త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ అనే గొప్ప కవిని గూర్చి చదివానని చెప్పుకొచ్చారు. పవన్‌కు పుస్తకాలు చదివే అలవాటు.. త్రివిక్రమ్‌కు ఉన్న సాహిత్య అభిరుచి ఈ ఇద్దరి మధ్య స్నేహాన్ని బలపరిచిందని చెప్పుకోవాలేమో!

    English summary
    Power Star Pawan Kalyan again mentioned Jalsa movie in his latest speech at Agnyaathavaasi audio release. He said after the release of jalsa, untill 3years he does't know it was a hit movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X