»   » అటు 'కొమరం పులి'..ఇటు 'కొమరం భీమ్‌'

అటు 'కొమరం పులి'..ఇటు 'కొమరం భీమ్‌'

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొమరం పులి చిత్రం ఓ ప్రక్క రిలీజ్ అవుతూంటే...మరో ప్రక్క నిజ జీవిత చరిత్రగా రూపొందిన 'కొమరం భీమ్‌' చిత్రం కూడా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల హక్కుల కోసం తపించిన వ్యక్తి జీవితం 'కొమరం భీమ్‌'. దాదాపు ఇరవయ్యేళ్ల కిందటే ఈ చిత్రం రెడీ అయ్యింది. అలాగే 1990లో 'కొమరం భీమ్‌' చిత్రానికి రెండు నంది అవార్డులొచ్చాయి. అయితే విడుదలలో జాప్యం చోటు చేసుకొని ఇన్నాళ్ళకు విముక్తి లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ మాట్లాడుతూ "పలు కారణాల వల్ల ఇన్నాళ్ళు విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఎఫ్‌డీసీ, కొమరం భీమ్‌ ఫౌండేషన్‌లు విడుదల చేయడానికి ముందుకొచ్చాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము"అన్నారు. ఇక ఈ చిత్రంలో భీమ్ ‌గా భూపాల్ ‌రెడ్డి నటించారు. సంగీతం..గౌతమ్‌ ఘోష్‌. ఇక పవన్ కళ్యాణ్ కొమురం పులి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. నిఖితా పటేల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ మొట్ట మొదటిసారిగా పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. అంతే కాకుండా ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నారు. అలాగే 'కొమరం పులి', 'కొమరం భీమ్‌' టైటిల్స్ ఒకేలా ఉండటం కొంత కన్ఫూజ్ అవుతారని అనుమానపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu