For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్ నట విశ్వరూపం చూస్తారు.. మీరు కోరుకునే స్థాయికి పవర్‌స్టార్.. త్రివిక్రమ్ ఎమోషనల్

  By Rajababu
  |

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అభిమానుల హంగామా మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఈ వేడుకకు ఫ్యాన్స్, సినీ వర్గాలు పోటెత్తాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వేదికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారు అని ఉద్వేగంగా మాట్లాడారు.

  మరో సారి పాటపాడుతున్న పవన్
  పవన్ కల్యాణ్ బాధపడుతారు..

  పవన్ కల్యాణ్ బాధపడుతారు..

  అందరికీ నమస్కారం. అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాలు మాట్లాడుకొందాం. లోపలికి వచ్చేటప్పుడు ఓ అభిమాని దెబ్బలు తెగిలాయి. ఇంటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్స్ పై వేగంగా వెళ్లకూడదు. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అయితే పవన్ బాధపడుతాడు.

   ఎందరో మహానుభావులు అంటూ..

  ఎందరో మహానుభావులు అంటూ..

  ఈ సినిమా గురించి మాట్లాడలంటే.. ఎందరో మహానుభావాలు అందరికీ వందనాలు. వేదికపై ఉన్నవారందరూ ఎందరో మహానుభావాలు. సినిమా అంటే వేరే ఏ పని తెలియని వ్యక్తి కెమెరామెన్ మణిగారు. ఈ సినిమాకు ఆయన ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. మీరంతా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే వీరంతా మహానుభావాలు.

  కళా దర్శకుడు ప్రకాశ్

  కళా దర్శకుడు ప్రకాశ్

  కళా దర్శకుడు ప్రకాశ్ తో అ ఆ సినిమాతో ప్రారంభమైంది. మణి లాంటి ఫర్‌ఫెక్షన్ లాంటి వ్యక్తికి ధీటుగా పనిచేశారు. అనిరుధ్ రవిచందర్‌తో అ ఆ సినిమాకు పనిచేయాల్సి ఉండేది. కానీ కుదర్లేదు. ఈ సినిమాకు అడుగగానే ఒప్పకొన్నాడు.

   నడిచే ఫిలిం లైబ్రరీ

  నడిచే ఫిలిం లైబ్రరీ

  బోమన్ ఇరానీ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఆయన నడిచే ఓ ఫిలిం లైబ్రరీ. నేను అసూయ పడే రచయిత కూడా. ప్రతీ సీన్‌లో నన్ను పుష్ చేస్తాడు. ఇంతకంటే ఏమీ రాయలేవా అన్నట్టు చూస్తారు. నన్ను మంచి రచయితగా చేయడానికి ఆయన సహాయపడ్డారు.

   నన్ను తట్టిలేపే తనికెళ్ల

  నన్ను తట్టిలేపే తనికెళ్ల

  తనికెళ్ల భరణి నాకు పెద్దన్నయ్య లాంటి వాడు. ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రను రాశాను. నాలో మధ్య తరగతి యువకుడిని తట్టిలేపిన వ్యక్తి. భీమవరంలో పుస్తకాల కోసం వెంపర్లాడే వ్యక్తిని ఎప్పడు తనికెళ్ల భరణి తట్టిలేపుతాడు.

   కష్టంలో సంతోషంగా పనిచేయాలి.

  కష్టంలో సంతోషంగా పనిచేయాలి.

  మురళీ శర్మను ఈ సినిమాలో నటింపజేయాలని అనుకొన్నాను. కానీ డేట్స్ కుదర్లేదు. కానీ నేను మాట్లాడిన వెంటనే మురళీ ఒప్పుకొన్నాడు. రాత్రి ముంబైలో డేలో హైదరాబాద్‌లో పనిచేశాడు. కష్టమైన పరిస్థితుల్లో చాలా సంతోషంగా ఎలా పనిచేయాలో మురళీ శర్మ నుంచి నేర్చుకొన్నాను.

   రావు రమేష్‌తో పనిచేయడం

  రావు రమేష్‌తో పనిచేయడం

  నాకు నచ్చిన నటుడు ఎస్వీ రంగారావు. నటి సావిత్రి. ఆ తర్వాత వారి తర్వాత గొప్ప నటుడు రావుగోపాలరావు. ఆయనతో పనిచేసే అవకాశం లభించలేదు. కానీ ఆయన కుమారుడు రావు రమేశ్‌తో పనిచేసే అవకాశం లభించింది. రావు రమేశ్ తల్లి పండితురాలు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అంటారు. కానీ రావు రమేశ్ అలాంటివాడు కాదు. ఆయనకు తల్లి పోలీకలు వచ్చాయి.

  కోట్లమంది వద్దకు

  ఇంతపెద్ద సినిమాను కోట్లమంది ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా ఎవడు అనగా.. అభిమానులు పవన్ కల్యాణ్ అంటూ అరుపులు, కేరింతలు కొట్టారు. పవన్ కల్యాణ్‌కు ఈ కథను ఫోన్‌లో రెండు నిమిషాలు చెప్పాను. అంతే మనం చేస్తున్నాం అని ఫొన్ పెట్టేశారు. అప్పటి నుంచి ఏ విషయం కూడా అడుగలేదు. నేను చెప్పింది ఆయన చేశాడు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారు.

   మీరు కోరుకునే స్థాయికి పవన్

  మీరు కోరుకునే స్థాయికి పవన్

  పవన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావాలని అనుకొంటున్నాను. మీరు అందరూ కోరుకుంటున్నట్టు ఆయన ఆ స్థాయికి చేరుకోవాలి. మనకు ఇష్టం ఉన్న వ్యక్తి గురించి పదే పదే బయటకు చెప్పుకోవద్దు. అమ్మ గురించి మనం ఎక్కువగా చెప్పుకోం. అలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు అని త్రివిక్రమ్ అన్నారు.

  English summary
  Pawan kalyan latest movie is Agnyaathavaasi. Pawan Kalyan's Agnyaathavaasi second song released.This film is getting ready for Sankrathi festival. After this movie. This movie going to release in highest locations in US. In this occassion, Trivikram Srinivas speaks emotionally.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more