twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అజ్ఞాతవాసి’ లాస్ : దిల్ రాజతో పాటు అందరికీ ఫోన్లు... హ్యాపీ న్యూసే!

    By Bojja Kumar
    |

    వరుస విజయాలు అందుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఎదుగుతున్న వారిలో ప్రముఖ నిర్మాత, హారిక అండ్ హాసిన క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ఒకరు. 'జులాయి' సినిమాతో మొదలు పెట్టి వరుసగా హిట్లు కొడుతున్న ఆయనకు 'అజ్ఞాతవాసి' సినిమాతో భారీ దెబ్బ పడింది.

     తట్టుకుని నిలబడ్డ చినబాబు

    తట్టుకుని నిలబడ్డ చినబాబు

    ‘అజ్ఞాతవాసి' సినిమా వల్ల వచ్చిన నష్టానికి మామూలు ప్రొడ్యూసర్ అయితే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేవాడేమో. అయితే ఇప్పటికే పలు హిట్స్ కొట్టి ఉండటంతో తట్టుకుని నిలబడ్డారు చినబాబు. అంతే కాదు ఈ ఫెయిల్యూర్ వల్ల తనపై బ్లాక్ మార్కు పడకూడదని, ఇండస్ట్రీలో తన రిలేషన్స్ దెబ్బతినకూడదు అనే ఉద్దేశ్యంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సగంమేర పరిహారం కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు.

    భారీగా నష్టపోయిన దిల్ ‌రాజు

    భారీగా నష్టపోయిన దిల్ ‌రాజు

    ‘అజ్ఞాతవాసి' సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో భారీగా నష్టపోయింది నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఆయనకు ఈ సినిమా వల్ల రూ. 14 కోట్ల మేర నష్టం వచ్చిందట. ఈ డబ్బుతో ఆయన ఒక మీడియం రేంజి సినిమా నిర్మించడంగానీ, రెండు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చేయవచ్చు.

    దిల్ రాజుకు రూ. 7కోట్ల పరిహారం

    దిల్ రాజుకు రూ. 7కోట్ల పరిహారం

    ‘అజ్ఞాతవాసి' సినిమాతో దిల్ రాజు రూ. 14 కోట్లు నష్టపోయిన నేపథ్యంలో అందులో సగం... అంటే రూ. 7కోట్లు తిరిగి పరిహారం కింద చినబాబు ఇస్తున్నట్లు సమాచారం. దిల్ రాజుతో తన రిలేషన్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.

     మిగతా డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు

    మిగతా డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు

    ‘అజ్ఞాతవాసి' సినిమా వల్ల నష్టపోయిన మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా రాధాకృష్ణ నుండి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. కొందరికి నష్టపరిహారం ఇవ్వడం మరికొందరికి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారట.

     రాధాకృష్ణ విషయం హాట్ టాపిక్

    రాధాకృష్ణ విషయం హాట్ టాపిక్

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున ఏ ప్రొడ్యూసర్ పరిహారం కింద ఇవ్వలేదట. పెద్ద నిర్మాతలు, ఎక్స్ పీరియన్స్ ఉన్న నిర్మాతలు సైతం రాధాకృష్ణ చేస్తున్న ఈ పని చూసి ఆశ్చర్యపోతున్నారు.

     కొందరిలో ఆందోళన

    కొందరిలో ఆందోళన

    అదే సమయంలో రాధాకృష్ణ చేస్తున్న పనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇండస్ట్రీలో అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారట.

    English summary
    Producer Radha Krishna doesn’t want Agnyaathavaasi to be a black mark in his successful career. So he decided to share the losses of the distributors by compensating their losses to some extent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X