twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలవిల్లాడుతున్నారు: 'స్టార్స్' దెబ్బకు నిజంగా చుక్కలే.., 'అజ్ఞాతవాసి'తో అగమ్యగోచరంగా..

    |

    చాలామంది నిర్మాతలు గొప్పలకు పోయి రికార్డుల గురించి మాట్లాడుతారు కానీ.. నిజాలు మాట్లాడితే అన్నీ 'బొక్కలే' కనిపిస్తాయని కొంతమంది ట్రేడ్ పండితులు చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమేనేమో అనిపిస్తుంటుంది కూడా. ఆ కాంబినేషన్‌కు ఉన్న మార్కెట్ తగ్గకుండా ఉండటానికే ఇలా తప్పుడు లెక్కలు చెబుతారని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. కానీ ఈ తప్పుడు లెక్కల వల్ల డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోతున్న పరిస్థితి..

     దారుణంగా దెబ్బయిపోతున్నారు:

    దారుణంగా దెబ్బయిపోతున్నారు:

    సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలి. కానీ ఇప్పటి సినిమా పోకడలు చూస్తుంటే మాత్రం ఎక్కువగా దెబ్బయిపోతున్నది వాళ్లే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. సినిమా చూడకుండా.. జస్ట్ హీరో, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో కోట్లు కుమ్మరించి సినిమాలు కొని.. పెట్టిన డబ్బు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోతున్నారు.

     నిండా మునుగుతున్నారు:

    నిండా మునుగుతున్నారు:

    పైకి చాలా సినిమాలు రికార్డులు బద్దలుకొట్టాయని నిర్మాతలు ఊదరగొడుతున్నప్పటికీ.. లోపల మేటర్ వేరే ఉందన్నది చాలామంది వాదన. అంచనాలకు మించి సినిమా బడ్జెట్ పెంచేయడం.. భారీ రేటుకు అంటగట్టి నాన్ రికవరీ అగ్రిమెంట్ చేసుకుంటుండటంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునుగుతున్న పరిస్థితి.

     'అజ్ఞాతవాసి' కోలుకోలేని దెబ్బ:

    'అజ్ఞాతవాసి' కోలుకోలేని దెబ్బ:

    తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' బయ్యర్లకు మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత నష్టాల్ని మిగిల్చిన చిత్రంగా ఈ సినిమా అపప్రదను మూటగట్టుకుంది. ఇక మహేష్ బాబు 'స్పైడర్' సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇలాంటి సినిమాల్ని కొని దారుణంగా దెబ్బతింటున్న డిస్ట్రిబ్యూటర్లు.. మళ్లీ సినిమాలు కొనాలంటే వణికిపోతున్నారు.

     హీరో, డైరెక్టర్ సేఫ్:

    హీరో, డైరెక్టర్ సేఫ్:

    సినిమా ఎన్ని నష్టాలు మిగిల్చిన హీరో, డైరెక్టర్ మాత్రం సేఫ్ అయిపోతున్నారన్న వాదన ఉంది. నిజానికి వీళ్లిద్దరి రెమ్యూనరేషనే మొత్తం బడ్జెట్ లో యాభై శాతం వరకు ఉంటుందని, బడ్జెట్ పెరిగిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సినిమా చేసినా.. హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేకపోవడం ఇప్పుడు నిర్మాతలను కూడా భయపెడుతున్న విషయమే.

     గుడ్డిగా నమ్మడంతోనే..:

    గుడ్డిగా నమ్మడంతోనే..:

    ఇంతకుముందు సినిమా కొనాలంటే ఫస్ట్ కాపీ చూశాకే డిస్ట్రిబ్యూటర్స్ కమిట్ అయ్యేవారు. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. కేవలం హీరో, దర్శకున్ని నమ్ముకుని.. వాళ్లు చెప్పినంత ముట్టజెప్పాల్సిందే. ఒకరకంగా గుడ్డిగా నమ్మేయడమే అని చెప్పాలి.

    'అజ్ఞాతవాసి'తో అగమ్యగోచరంగా..:

    'అజ్ఞాతవాసి'తో అగమ్యగోచరంగా..:

    నిజానికి పవన్ కల్యాణ్ గత రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. త్రివిక్రమ్ గత రెండు సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి, 'అఆ'లు కూడా ఓ మాదిరి హిట్ అనిపించుకున్నాయంతే.

    అయినా సరే, ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లు కోట్లు కుమ్మరించారు. ఏకంగా బాహుబలి-1ను మించిన రేటుతో అజ్ఞాతవాసిని కొనుగోలు చేశారు. తీరా సినిమా బెడిసికొట్టడంతో ఇప్పుడు వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

     రాబోయే సినిమాలకు కష్టమే:

    రాబోయే సినిమాలకు కష్టమే:

    బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లకు వరుసగా నష్టాలే ఎదురవుతుండటంతో.. స్టార్ హీరోల సినిమాలు కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఈ ప్రభావం త్వరలో విడుదలవబోయే సినిమాలపై ఉంటుందని చెబుతున్నారు. మహేష్ బాబు 'భరత్ అను నేను', రాంచరణ్ 'రంగస్థలం', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని వెచ్చించే సాహసం చేయకపోవచ్చు అంటున్నారు.

    English summary
    Pawan Kalyan film 'Agnyaathavaasi' created sensation right from the beginning but it has literally shocked everybody with its disastrous result.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X